Viral: పొద్దున్నే వచ్చి.. దేవుడికి భక్తితో దండం పెట్టాడు.. 3 ప్రదక్షిణలు చేశాడు.. ఆ తర్వాత..

భగవంతుడి హుండీకే కన్నం వేయాలనుకున్న ఓ దొంగ చేయి అందులో ఇరుక్కుపోయిన ఘటన ఇటీవల తమిళనాడులో వెలుగుచూసింది. తాజాగా కర్నాటక మంగళూరులో ఓ దొంగ దేవుడి హుండీతో పరారయ్యాడు. ఆ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. అయితే దొంగతనానికి ముందు దొంగ ఎంతో భక్తితో నమస్కరించడం ఇక్కడ హైలెట్.

Updated on: Apr 30, 2025 | 8:37 AM

ఈ మధ్య దొంగలు దేవుడికే ఎసరు పెడుతున్నారు. ఆయన హుండీ సొమ్మును కాజేయాలని చూస్తున్నారు. మొన్నీమధ్య తమిళనాడులో దొంగ డబ్బుల కోసం హుండీలో సొమ్ము కొట్టేయాలనుకున్న దొంగ చేయి.. అందులో ఇరుక్కపోయిన ఉదంతం వైరల్ అయింది. తాజాగా కర్నాటక నుంచి అలాంటి వార్తే వచ్చింది. అయితే ఇక్కడ దొంగ తన పని విజయవంతంగా పూర్తి చేశాడు. మంగళూరు నగరంలోని మేరీహిల్‌లోని కొరగజ్జన టెంపుల్ ఉంది.  అక్కడికి వచ్చిన దొంగ ముందుగా భక్తితో దేవుడికి నమస్కరించారు. అంతేనా..  మూడుసార్లు ప్రదక్షిణలు కూడా చేశాడు. చివరికగా మరోసారి కొరగజ్జనకు నమస్కరించి, ఆపై అక్కడే ఉన్న హుండీతో ఉడాయించాడు. ఈ వ్యవహారమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కోస్తా కర్ణాటకలో.. ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లాలో కొరగజ్జను ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us