Viral Video: సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వీడియోలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో కొన్ని చాలా ఫన్నీ కంటెంట్‌తో ఫుల్‌గా నవ్విస్తే.. మరికొన్ని చాలా ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని ఆలోచింపజేస్తుంటాయి. కొన్నింటిలో వారి ఆలోచనలకు సలామ్ చేయాలనిపిస్తుంటుంది. ఇలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. అసలే వర్షాకాలం, ఆపై బురద రోడ్లు. మరి ఇలాంటి టైంలో రోడ్డుపై నడవాలంటే చాలా జాగ్రత్తగా నడవాల్సిందే. లేదంటే ఒంటినిండా బురద పడడం ఖాయం. కానీ, ఈ వీడియోలో ఉన్న యువతి మాత్రం చాలా తెలివిగా ఆలోచించింది. అవతలి వాళ్లే దడపుట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి బురద రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుంది. తన వెనకాల ఓ కారు హై స్పీడ్‌తో దూసుకొస్తుంది. దీంతో రోడ్డుపై ఉన్న బురద తన మీద పడుతుందని ఆలోచించి, వెంటనే ఓ పెద్ద రాయిని అందుకుని, కారు డ్రైవర్‌కు చూపించింది. ఇంకేముంది.. హై స్పీడ్‌తో వస్తున్న కారు దెబ్బకి స్లో అయింది. దాంతో బురద తన మీద పడకుండా సెల్ఫ్ ఢిపెన్స్ చేసుకుంది. దీంతో ఈ యువతిని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
ఈ వీడియోను 1992 బ్యాచ్‌కు చెందిన రుపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి తన ట్టిట్టర్లో షేర్ చేశాడు. జులై 16న షేర్ చేసిన ఈ వీడియో నాలుగు వేలకు పైగా వ్యూస్‌తో వందకు పైగా కామెంట్లతో సోషల్ మీడియాలో దూసుకపోతోంది. రుపిన్ శర్మ ‘కామన్స్ సెన్స్.. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సులభమైన మార్గం’ అంటూ రాసుకొచ్చారు. అల్టిమేట్ సెల్ఫ్ ఢిపెన్స్ అంటూ కొందరు, సూపర్ ఢిపెన్స్ అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మరికొంతమంది నీ తెలివికి జోహార్లు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Commonsense ……
अपने बचाव का आसान उपाय?? pic.twitter.com/i3E11qHluV
Ultimate self-defence…???
— Ajay (@ajay_mirzam) July 16, 2021
— Rupin Sharma IPS (@rupin1992) July 16, 2021
Superb self-defense.
— Upinder ❁ (@Upinder999) July 16, 2021
Also Read: