Viral Video: పాపం.. ఏదో చేయబోయాడు.. మరేదో జరిగింది.. యువకుడి విఫల ప్రయత్నం చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు..

Viral Video: కొంతమంది బైకర్స్.. తమ రైడింగ్ స్టైల్‌ను జనాలు చూపించాలని తహతహలాడుతుంటారు. ఈ క్రమంలో అనేక స్టంట్స్ చేస్తుంటారు.

Viral Video: పాపం.. ఏదో చేయబోయాడు.. మరేదో జరిగింది.. యువకుడి విఫల ప్రయత్నం చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు..
Bike Stunt
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 17, 2021 | 9:50 PM

Viral Video: కొంతమంది బైకర్స్.. తమ రైడింగ్ స్టైల్‌ను జనాలు చూపించాలని తహతహలాడుతుంటారు. ఈ క్రమంలో అనేక స్టంట్స్ చేస్తుంటారు. రన్నింగ్ బైక్‌ని పైకి లేపడం, ఉన్నచోటనే గింగిరాలు తిప్పడం, బైక్‌ నేలకు ఆనేలా డ్రైవ్ చేయడం వంటి ఫీట్స్ చేస్తుంటారు. అయితే, ఈ స్టంట్స్ చేసే సమయంలో చాలా అప్రమత్తండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ప్రాణాలే పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ ఫీట్స్‌ చేసే వాళ్లలో కొంతమంది సక్సెస్ అయితే.. ఒక్కోసారి కొంతమంది ఘోరంగా విఫలం అవుతుంటారు. తాజాగా ఓ బైకర్ విఫల ప్రయత్నం.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. వర్షపు నీటిలో అతను చేసిన ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయి.. నేటిజన్లతో కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ ఫెయిల్యూర్ బైక్‌ స్టంట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడది ట్రెండింగ్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ యువకుడు వర్షపు నీటిలో తన బైక్‌పై స్టంట్ చేయబోయాడు. ఉన్న చిన్నపాటి గల్లీలో భారీగా వర్షపు నీరు నిలిచింది. ఆ నీటిలోనే ఓ యువకుడు తన బైక్‌పై బయటకు వచ్చాడు. అటు చివర నుంచి ఇటు చివర వరకు బైక్‌ని వెనుక వీల్‌పై నడిపించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నానికి ఆదిలోనే బ్రేక్ పడింది. బైక్‌ను స్టార్ట్ చేసిన యువకుడు.. కొద్ది సెకన్ల వ్యవధిలోనే ముందు చక్రాన్ని పైకి లేపాడు. అయితే, అదికాస్తా అదుపు తప్పి పక్కనే ఉన్న ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టింది. ప్రహరీ గోడ మొత్తం కూలిపోయింది. అప్పటికీ ఆ యువకుడు బైక్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. కాగా, ఈ స్టంట్‌ను ఎదురుగా మరికొందరు వీడియో తీయగా.. చుట్టుపక్కన వారు ఆ యువకుడిని చూస్తూ ఉండిపోయారు. అయితే, ఆ స్టంట్ కాస్తా విఫలమవడంతో.. ఫక్కున నవ్వుకున్నారు. అయితే ఈ ఫెయిల్యూర్ స్టంట్ వీడియోను ‘splendor_bullet_love’ ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఇది చూసి ఫుల్ మస్తీ అవుతున్నారు. సెటైర్లు పేల్చుతున్నారు. ‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ బ్రో’ అంటూ సింపతీ ప్రకటిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Kanipakam: కాణిపాకంలో తెలంగాణ భక్తుల సందడి.. ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయిన స్థానికులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Farmers: రాజస్థాన్‌లో రైతును తన్ని, కూతుర్ని ఈడ్చుకెళ్లిన అధికారి.. వీడియో వైరల్‌ అవడంతో మారిన సీన్..

Viral Video: పెళ్లి వేడుకలో వరుడి కునికిపాట్లు.. వధువు పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం.. నెట్టింట్లో మస్తీ వీడియో హల్‌చల్..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట