Viral Video Massive Sea Turtle: బురదలో చిక్కుకున్న 272 కిలోల బరువున్న తాబేలును రక్షించి సురక్షితంగా తిరిగి సముద్రంలోకి తరలించడానికి మూడు ఏజెన్సీల సహా కొంతమంది ప్రజలు కలిసి పని చేశారు. ఈ తాబేలుని తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రవాణా బండి, స్ట్రెచర్, చాపలను ఉపయోగించారు. మసాచుసెట్స్‌లో బురదలో చిక్కుకుపోయిన 272 కిలోల బరువైన మముత్ లెదర్‌బ్యాక్ తాబేలును న్యూ ఇంగ్లాండ్ అక్వేరియం నిపుణులు సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టారు. హెర్రింగ్ నదిలోని బురదలో తాబేలు చిక్కుకుపోయిందని అక్వేరియం అధికారులు తెలిపారు. ఇలా తాబేలుని సముద్రంలోకి రిలీజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
5 అడుగుల పొడవైన తాబేలు బురదలో చిక్కుకుని కష్టపడుతున్న చూసి.. అంతర్జాతీయ జంతు సంరక్షణ సంక్షేమ సంస్థకు సమాచారం అందించారు. వెంటనే తాబేలుని రక్షించి పశువైద్యుల వద్దకు తీసుకుని వెళ్లారు. తాబేలుని పరీక్షించి అది సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని నిర్ధారించారు. పశువైద్యుల నుండి అనుమతి పొందిన తర్వాత, తాబేలును తిరిగి సముద్రంలోకి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ భారీ తాబేలుని సురక్షితంగా నీటిలోకి తరలించడానికి మూడు ఏజెన్సీలు పని చేశారు. అయితే ఇలా తాబేలుని సముద్రంలోకి విడుదల చేసే ముందు దానికి ఉపగ్రహం, ఎకౌస్టిక్ ట్రాకింగ్ పరికరాలు అమర్చారు. అయితే ఇలా తాబేలు ఒంటరిగా ఒడ్డుకు రావడానికి కారణం.. ఎవరూ దానికి లేకపోవడమే అంటూ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు.
Also Read: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..