Viral Video: నెట్టింట్లో వైరల్ వీడియోల సందడే వేరు. ఏదైనా కొద్దిగా వింతగా అనిపిస్తే ఫోన్‌తో షూట్ చేసి నెట్టింట్లో అప్‌లోడ్ చేస్తుంటారు. చాలా వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అలాగే ప్రతిరోజు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో యాడ్ అవుతూనే ఉన్నాయి. సాధారణంగా మనం బురద రోడ్డులో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంటాం. అయితే, ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మాత్రం ఓ వ్యక్తి జాగ్రత్తగానే అడుగులు వేశాడు. కానీ, ఫలితం మరోలా అతనికి ఎదురైంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ వీడియోలోని వ్యక్తి.. చిన్న బురద కుంటను దాటి మరోవైపుకి వెళ్లాల్సి ఉంది. చెప్పులు చేతబట్టుకుని బురదలోంచి నడిచి వెళ్లేందుకు ప్లాన్ బాగానే వేశాడు. కానీ, అలా బురదలో కాలు పెట్టాడో లేదో.. అందులో పూర్తిగా మునిగిపోయాడు. అయితే, అది ఊబి కాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియోను ది సన్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దాంత నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తూ వీడియోను వైరల్ చేసేస్తున్నారు. ఈ వీడియో 1.23 లక్షల వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది.
అయితే, ఇది కావాలని చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేదా వీడియో తీసే వ్యక్తికి తెలిసినా.. బురదలో పడిన వ్యక్తికి చెప్పకుండా ఆటపట్టించేందుకు ఇలా చేశాడంటూ మరొకరు కామెంట్ చేశాడు. అక్కడ అసలు గొయ్యి ఉన్నట్లే అనిపించట్లేదంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.
ఆ వీడియోను మీరూ చూడండి:
Human to mud monster in 0.5 seconds ?
?: the3dumbbells pic.twitter.com/YG5yA1xTOx
— The Sun (@TheSun) July 24, 2021
Also Read: Viral Video: కొండచిలువను పట్టి కరకరా నమిలి మింగేసిన మొసలి.. చూస్తే షాకవుతారు
చైనా సొరంగాల నిర్మాణం.. శాటిలైట్ రిలీజ్ చేసిన పిక్స్ వైరల్.!
Viral Video: కండోమ్ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి.. వీడియో వైరల్..!