Viral Video: తగ్గేదేలే.. చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్‌ చేస్తోన్న బుల్లి పప్పీ.. వైరలవుతోన్న వీడియో..

మనుషులతో కలిసి తిరుగుతూ, పరిగెత్తే కుక్కలను మీరు చాలానే చూసి ఉంటారు. కానీ, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి కుక్కను మాత్రం చూసి ఉండరు.

Viral Video: తగ్గేదేలే.. చిన్నారితో పోటీపడుతూ స్కిప్పింగ్‌ చేస్తోన్న బుల్లి పప్పీ.. వైరలవుతోన్న వీడియో..
Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Mar 28, 2022 | 4:05 PM

కుక్కలు(Dogs) ప్రపంచంలోనే అత్యంత విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌లుగా పేరుగాంచాయి. మనుషులు వాటితో ఎంతో అనుబంధం కలిగి ఉంటారు. అదే విధంగా కుక్కలు కూడా మనుషులపై అంతే విశ్వాసాన్ని చూపిస్తాయి. ఇలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. వారు కుక్కలను చాలా ప్రేమిస్తారు. కుక్కలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక కుటుంబంలో చేరిన తరువాత, అవి వారితో ఎంతో కలిసిపోతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలతో కుక్కలు రోజంతా ఆడుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలను చూసి ఉంటారు. తాజాగా నెట్టింట్లో చేరిన ఓ వీడియోని చూస్తే మాత్రం షాకవుతారు. మీరు ఎప్పుడైనా ‘జంపింగ్ రోప్’ వ్యాయామం చేయడం చూశారా? అయితే, ఈ వీడియోను కచ్చితంగా చూసి తీరాల్సిందే. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోలో (Viral Video) ఒక చిన్న కుక్క స్కిప్పింగ్ చేయడం చూస్తే మాత్రం ఫిదా అవుతారంతే.

ఓ చిన్నారి రోప్ జంపింగ్ ఎక్సర్ సైజ్ చేస్తుండగా, ఆమెతో పాటు ఓ చిన్న కుక్కపిల్ల కూడా జంపింగ్ చేయడం వీడియోలో చూడొచ్చు. ఇందులో చిన్న డాగీ బ్యాలెన్స్ చూసుకుంటూ దూకడం తప్పక చూడాల్సిందే. చూశాక మాత్రం ఇలాంటి వీడియో నెవ్వర్ భిపోర్ అంటారు. అమ్మాయి తాడును పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో ఎలా గెంతుతుందో, అదే విధంగా, చిన్న డాగీ కూడా అదే స్టైల్‌లో తనను తాను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ స్కిప్పింగ్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో cutepuppy542 అనే అకౌంట్‌లో షేర్ చేశారు. దీనికి ఇప్పటివరకు 16 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మందిఈ వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు.

Also Read: Viral: ఓన్లీ రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు.. లెక్కెట్టలేక అలసిపోయిన షోరూం సిబ్బంది

Anand Mahindra: అద్భుతమైన సక్సెస్ ఫార్ములా చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ఇది అందరకీ ఉపయోగకరమైనదే..