Viral Video: యూట్యూబ్ వీడియోలు చూసి విమానం తయారు చేసిన జంట.. ఫిదా అవుతోన్న నెటిజన్లు..!

|

Jan 19, 2022 | 6:39 PM

ఓ కుటుంబానికి చెందిన వారు మాత్రం ఏకంగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఓ విమానాన్నే తయారు చేసి ఔరా అనిపించారు. నాలుగు-సీట్ల విమానాన్ని ప్రాజెక్ట్‌ను చేపట్టి విజయం సాధించడంతో వీరి ఆశయానికి హద్దులు లేకుండాపోయాయి. వివరాల్లోకి వెళ్దాం..

Viral Video: యూట్యూబ్ వీడియోలు చూసి విమానం తయారు చేసిన జంట.. ఫిదా అవుతోన్న నెటిజన్లు..!
Viral Video
Follow us on

Viral Video: COVID -19 మహమ్మారి మన జీవితాలను ఎంతగానో మర్చేసింది. గత రెండు సంవత్సరాలుగా చాలామంది ఇంటికే ఎక్కువగా పరిమితమయ్యారు. ఈ కాలంలో చాలామంది నెట్టింట్లో తమ ప్రతిభను వెలికితీసేందుకు ప్రయత్నించారు. యూట్యూబ్ చూస్తూ తమ టాలెంట్‌కు మరింత పదును పెట్టుకోవడంతో బిజీగా మారిపోయారు. అయితే ఓ కుటుంబానికి చెందిన వారు మాత్రం ఏకంగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఓ విమానాన్నే తయారు చేసి ఔరా అనిపించారు. నాలుగు-సీట్ల విమానాన్ని ప్రాజెక్ట్‌ను చేపట్టి విజయం సాధించడంతో వీరి ఆశయానికి హద్దులు లేకుండాపోయాయి. వివరాల్లోకి వెళ్దాం..

38 ఏళ్ల అశోక్ అలిసెరిల్, అతని భార్య అభిలాషా దూబే(35) వీరి పిల్లలు తారా(6), దియా(3) ఇందులో భాగస్వామ్యమయ్యారు. కాగా, అశోక్ శిక్షణ పొందిన పైలట్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. అతని కుటుంబం సహాయంతో, దాదాపు రెండు సంవత్సరాలలో విమానాన్ని నిర్మించారు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌కు చెందిన ఈ ఇంజనీర్ వారి తగ్గ విమానం కొనేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ, మార్కెట్లో వారి అంచనాలకు తగ్గవి లేకపోవడంతో నిరాశపడ్డారు. దీంతో ఎలాగైన విమానాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వారి అవసరాలకు సరిపోయే ఒక కిట్ విమానాన్ని దక్షిణాఫ్రికాలో కొనుగోలు చేశాడు. దానిని తన ఇంటికి తెప్పించుకుని రెండేళ్లుగా అదే ప్రయత్నంలో ఉండిపోయాడు. మార్చి 2020లో మొదలైన ఈ ప్రాజెక్ట్.. ఈ ఏడాది పూర్తయింది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత వారి కలను నెరవేర్చుకున్నారు.

కాగా, ఈ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు £155,000 (రూ. 1.57 కోట్లు) అని పేర్కొన్నారు. సకాలంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేశారంట. మొత్తానికి రెండేళ్ల కష్టానికి ఫలితం రావడంతో ఆ కుంటుంబం సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. ఈ విమానంలో ఈ కుటుంబం వేసవి సెలవుల కోసం ఐల్ ఆఫ్ వైట్‌కి వెళ్లాలని ఆశిస్తున్నారు.

Also Read: Viral Video: తగ్గేదేలే.! చిరుతతో కుక్క ఫైటింగ్.. చివరికి ఎవరో గెలిచారో చూస్తే షాకవ్వాల్సిందే!

Viral Video: అడవి రాజుకి చుక్కలు చూపించిన జిరాఫీ.. వణుకుపుట్టించే వీడియో వైరల్