Viral Video: తగ్గేదేలే.! చిరుతతో కుక్క ఫైటింగ్.. చివరికి ఎవరో గెలిచారో చూస్తే షాకవ్వాల్సిందే!
పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి.. ఇలా కొన్ని జంతువులకు సంబంధించిన ఫైటింగ్ వీడియోలు మీరు చూసే ఉంటారు....
పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి.. ఇలా కొన్ని జంతువులకు సంబంధించిన ఫైటింగ్ వీడియోలు మీరు చూసే ఉంటారు. అయితే మీరెప్పుడైనా చిరుత-కుక్క యుద్ధం చేసుకోవడం చూశారా.? ఇది కాస్త రేర్ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవిలో అత్యంత క్రూరమైన జంతువులలో చిరుత(Leopard) కూడా ఒకటని చెప్పొచ్చు. తన ఎరను క్షణాల్లో మట్టుబెట్టేయగల సామర్ధ్యం చిరుత సొంతం. అలాంటి చిరుతతో సాధు జంతువైన కుక్క తలబడితే ఎట్టుంటుందో తెలుసా.? ఇదిగో ఇలా ఉంటది.
అటవీ ప్రాంతం సమీపంలో తనకు ఎరగా దొరికిన ఓ కుక్కను చిరుత తన పదునైన దవడలతో ఉడుంపట్టు పడుతుంది. దీనితో కుక్కకు ఎటూ తప్పించుకునే వీలుండదు. అయితే తన ఎదురుగా ఉన్న క్రూర జంతువుకు ఓటమిని ఒప్పుకోకుండా చిరుత బలమైన దవడల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది కుక్క. ఇలా కాసేపు వీరిద్దరి మధ్య పోరాటం జరగ్గా చివరికి కుక్క ఇందులో విజయం సాధిస్తుంది. చిరుత తోక ముడుచుకుని పారిపోతుంది.
View this post on Instagram
ఈ వీడియోను ‘nature27_12’ అనే ఇన్‌స్టా అకౌంట్ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి 4 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కాగా, దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొందరు కుక్కకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందగా.. మరికొందరు కుక్క ధైర్యాన్ని చూసి మెచ్చుకున్నారు. ఇంకొందరైతే ఈ సీన్‌ను వీడియో తీసిన ఫోటోగ్రాఫర్‌పై విమర్శలు గుప్పించారు.