స్నేహమంటే ఇదేరా.. నీటిలో పడ్డ ఏనుగు పిల్ల.. దాని ఫ్రెండ్స్ ఏం చేసేయంటే !
నీళ్లు తాగుతూ కుంటలో పడిన పిల్ల ఏనుగును కాపాడేందుకు తల్లి ఏనుగుతో పాటు మరో రెండు ఏనుగులు పడిన తపన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వాటి సమష్టి కృషితో పిల్ల ఏనుగు సురక్షితంగా బయటపడింది. ఏనుగుల అద్భుతమైన ప్రేమ, ఐక్యతను చాటిచెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, లక్షల వీక్షణలు పొందుతోంది. మనుషులు కూడా వీటి నుండి ఎంతో నేర్చుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపించినా.. అంతే సున్నితంగా ఉంటాయి. కోపం వస్తే మాత్రం వాటిని ఆపతరం కాదు. ఎన్నో ఆలయ ఉత్సవాలలో ఏనుగులు బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే.. గుండెలను హత్తుకునేలా ఉంటాయి. ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయింది. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంది. అంతలో దూరం నుంచి గమనించిన పెద్ద ఏనుగులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాయి.. ముందుగా తల్లి ఏనుగు తన పిల్లను పట్టుకుని ఒడ్డుకు లాగేందుకు ప్రయత్నించింది. చిన్న పిల్ల జారి నీటిలో పడటం చూసి తల్లి ఏనుగుల గుండె గుభేల్ మంది. ఇది గమనించిన మరో రెండు ఏనుగులు కుంట వద్దకు వచ్చాయి. తలా ఓ చేయి వేసాయి. పిల్ల ఏనుగును పైకి లాగే ప్రయత్నం చేసాయి. చివరకు పిల్ల ఏనుగు అవి అందించిన సపోర్ట్‌తో నేల పైకి ఎగబాకింది. ఎంతో జాగ్రత్తగా ఏనుగులన్నీ కలిసి చేసిన పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఏనుగుల ప్రేమ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఏనుగులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’.. అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్తికేయతో ప్రియాంక చోప్రా, సితార ఫొటో వైరల్
పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. చివరికి !!
ఉద్యోగి 40 ఏళ్ళ సేవలను మెచ్చుకొని సన్మానం
రన్నింగ్ ట్రైన్‌లో వంటలు చేసిన మహిళ.. ఇండియన్ రైల్వే ఏం చేసిందంటే
