చిరుతకు మేకను ఎరగా వేసిన అధికారులు..నెక్ట్స్ సీన్ చూస్తే నవ్వాగదు వీడియో
ఇటీవల కాలంలో చిరుతలు బెడద ఎక్కువైపోయింది. అడవుల్లో ఆహారం దొరక్క జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు మేకను ఎరగా ఉంచి చిరుతకోసం బోను ఏర్పాటు చేశారు. మర్నాడు బోనులో చిరుతపడిందేమోనని చెక్ చేయడానికి వచ్చిన అధికారులు అందులో ఉన్నది చూసి షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా ఫఖర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి దెహ గ్రామంలో ఇటీవలే చిరుత దాడిలో శాంతి దేవి అనే వృద్ధురాలు మరణించింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, ఆ చిరుతను పట్టుకోవడానికి గ్రామానికి సమీపంలో ఒక బోనును ఏర్పాటు చేసి, అందులో మేకను ఎరగా కట్టారు. నవంబరు 27 గురువారం రాత్రి ప్రదీప్ అనే స్థానిక వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనును చూశాడు. బోను వద్దకు వెళ్లి అందులో ఉన్న మేకను దొంగిలించాలనుకున్నాడు. మేకను పట్టుకునేందుకు బోను లోపలికి వెళ్లగా ఆటోమేటిక్ డోర్ ఒక్కసారిగా మూసుకుపోయింది. దీంతో అతను మేకతో పాటు లోపలే చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక, తన మొబైల్ ఫోన్ ద్వారా గ్రామస్థులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమచారం ఇవ్వగా..వారు పోలీసులను వెంటపెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సురక్షితంగా బయటకు తీశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

