సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో
వేటకు బయలుదేరిన సింహం కంటపడిన మనిషైనా, జంతువైనా తప్పించుకోవడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితిలో సాధారణంగా సింహానికి మనిషి ఎదురెళ్లినా.. మనిషికి సింహం ఎదురొచ్చినా ప్రమాదం మనిషికే. అయితే..ఇలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ విశేషమేంటంటే.. అనుకోకుండా ఎదురుపడ్డ ఆ మనిషి, సింహం.. ఒకేసారి భయంతో కాలికొద్దీ పరిగెత్తటం జరిగింది.
గుజరాత్‌లోని జునాగడ్‌లో జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. జునాగడ్ సిటీకి సమీపంలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి కాసేపు బయట తిరుగుదామని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చాడు. కాంపౌండ్ నుంచి బయటకు వెళ్తుండగా.. ఊహించని రీతిలో అతడికి ఒక ఆడ సింహం ఎదురైంది. దీంతో.. ఒక్క క్షణం పాటు ఆ ఉద్యోగి, సింహం షాక్‌కు లోనైనా.. మరుక్షణంలో చెరోవైపు పరుగులెత్తారు. ఆగస్ట్ 6న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఫ్యాక్టరీలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదని, ఈ సీన్‌లో ఉద్యోగి కంటే.. సింహమే ఎక్కువ భయపడిందని చాలామంది నెటిజన్లు కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :