బంగారం కావాలా? ఈ క్రిమిని పెంచుకుంటే పోలా వీడియో

Updated on: Aug 15, 2025 | 9:28 AM

చిన్నతనంలో బంగారు గుడ్లు పెట్టే బాతు కథ విన్నాం. అది కథ మాత్రమే. నిజంగా బంగారు గుడ్లు పెట్టే బాతు ఉందో లేదో కానీ.. బంగారాన్ని పెట్టే క్రిమి మాత్రం ఉంది. అవును మీరు వింటున్నది నిజమే. అతివలు ఎంతగానో ఇష్టపడే పట్టుచీరల దారాలు.. పట్టుపరుగు నుంచి వచ్చినట్లు..ఇప్పుడు బంగారం కూడా పురుగునుంచి వస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

24 క్యారెట్ల ప్యూర్‌ గోల్డ్‌ను విసర్జించే ‘కుప్రియోవిడస్‌ మెటాలీడ్యూరన్స్‌’ మీద ఇప్పటి పరిశోధనలు మరింత సక్సెస్ అయితే..ఇక పుత్తడికి లోటు లేనట్లే. ఓ పక్క బంగారం ధర పైపైకి వెళ్లిపోతూ, జనాలను కంగారుపెడుతుంటే, మరోపక్క చెత్త తిని-24 క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. కుప్రియోవిడస్‌ మెటాలీడ్యూరన్స్‌ అనే పేరుగల ఈ బ్యాక్టీరియాను సైంటిస్టులు ముద్దుగా ‘గోల్డ్‌ పూపింగ్‌ బ్యాక్టీరియా’ అని పిలుస్తారు. రాగి, ఇతర లోహాలు కలిసిన బంగారం, నికెల్‌ వంటి వాటిని తిన్నప్పుడు తన జీర్ణవ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైముల సాయంతో ఈ బ్యాక్టీరియా వాటిని 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంగా మార్చి విసర్జిస్తుంది. ఇదేదో బాగానే ఉంది… అర్జంట్‌గా ఆ బ్యాక్టీరియాని తెచ్చేసుకుని ఇంట్లోనే పెంచేసుకుంటే లక్షలకు లక్షలు పోసి బంగారాన్ని కొనక్కర్లేదు అనుకుంటున్నారా? కానీ… ఈ బాక్టీరియా మన కంటికి కనిపించదు. దీని తాలూకు విసర్జితాలు నానోపార్టికల్స్‌ పరిమాణంలో ఉండి అసలే కనిపించవట.మరి కళ్ళకే కనిపించని ఈ బంగారు బ్యాక్టీరియాలను మునుమందు ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి మరి.

మరిన్ని వీడియోల కోసం :

ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో

21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?

అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!