గంగా నదిలో తేలుతూ కనిపించిన వందల కిలోల బరువైన రాయి.. వీడియో

Updated on: Jul 27, 2025 | 9:43 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని గంగా నది ఒడ్డున ఉన్న దాద్రి ఘాట్‌పై ఒక పెద్ద రాయి తేలుతున్నట్లు కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే, ఈ రాయి బరువు సుమారు 2 నుంచి 3 మూడు క్వింటాళ్లు ఉన్నప్పటికీ ఇది నీటిలో తేలుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ రాయిని కదిలించేందుకు చాలా మంది ప్రయత్నించినా దాన్ని ఎత్తలేకపోయారు. దీంతో ఈ రాయిని శ్రీరాముని మహత్యంగా భావించి వాళ్లు పూజలు చేస్తున్నారు. ఇలాంటి రాళ్ల గురించి రామాయణంలో ప్రస్తావన ఉంది.

త్రేతా యుగంలో, రాముడు లంకపై దాడి చేయడానికి రామసేతును నిర్మించడానికి ఇటువంటి రాళ్లను ఉపయోగించాడని చెబుతారు.ఈ రాయి విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇది రామాయణ కాలం నాడు సముద్రంలో రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాయేనని నమ్మూతూ దానికి పూజలు చేస్తున్నారు. అయితే శుక్రవారం రోజు గంగానదిలో స్నానం చేయడానికి వచ్చిన సోను అనే వ్యక్తి ఈ రాయిని గమనించాడు. నది ఒడ్డు నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో ఏదో కదులుతున్నట్టు గుర్తించిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి చశాడు. అక్కడ తేలుతూ కనిపించిన పెద్ద రాయిని చూసి దానిని ఒడ్డుకు చేర్చి తాళ్లతో కట్టేశారు. ఉదయం స్నానం చేయడానికి గంగా ఘాట్ వచ్చిన భక్తులు నదిలో తేలుతున్న కనిపించిన రాయిని చూశారు. ఇది రామసేతు రాయిగా భావించి పూజలు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

మతిస్థిమితం కోల్పోయిన క్రేజీ నటి .. రోడ్లపై తిరుగుతూ..చివరకు

ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో

అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో

ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్‌, రోబోలతో సిరుల సేద్యం వీడియో

ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో