UP Topper: ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

UP Topper: ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

Anil kumar poka

|

Updated on: Apr 23, 2024 | 2:20 PM

సృష్టిలోని ప్రతిమనిషీ అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంతచేసినా అది కొన్ని రోజులు లేదా సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్నాళ్లకి దానికి ఎక్స్‌పైరీ డేట్‌ వస్తుంది. అందం కాస్తా వాడిన పువ్వులా మారిపోతుంది. ఇది అందరికీ తెలిసిన అంగీకరించలేని సత్యం. అయినా కొందరు అందంగా లేరనో, రంగు విషయంలోనో అవతలి వ్యక్తులను చిన్నచూపుచూస్తారు.

సృష్టిలోని ప్రతిమనిషీ అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంతచేసినా అది కొన్ని రోజులు లేదా సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కొన్నాళ్లకి దానికి ఎక్స్‌పైరీ డేట్‌ వస్తుంది. అందం కాస్తా వాడిన పువ్వులా మారిపోతుంది. ఇది అందరికీ తెలిసిన అంగీకరించలేని సత్యం. అయినా కొందరు అందంగా లేరనో, రంగు విషయంలోనో అవతలి వ్యక్తులను చిన్నచూపుచూస్తారు. అడుగడుగునా అవమానిస్తూనే ఉంటారు. తామెంతో అందంగా ఉన్నామని గర్వపడుతూ ఉంటారు. అలాంటి అవమానాలెన్నో ఎదుర్కొంది ఓ టీనేజ్‌ అమ్మాయి. ఆ అవమానాలనే ఆయుధాలుగా మలచుకొని తనను అవమానించినవారే తనముందు తలదించుకునేలా చేసింది. తనలోని ప్రతిభతో ఎగతాళి చేసివారితోనే శభాష్‌ అనిపించుకుంది.

ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ప్రాచీ నిగమ్‌ అనే టీనేజ్‌ బాలిక తన ముఖంపై వచ్చిన అవాంఛిత రోమాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అడుగడుగునా అవమానాలే.. ఇంటర్‌నెట్‌లోసైతం విపరీతమైన ట్రోల్స్‌కి గురయ్యింది. ఆ అవమానాలన్నింటినీ ఒక్క గెలుపుతో అధిగమించి, ప్రతిభకు అందంతో పనిలేదని చాటిచెప్పింది. ఉత్తరప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పది, పన్నెండు తరగతుల ఫలితాలు ఇటీవల ఏప్రిల్‌ 20, 2024న విడుదల చేసింది. అందులో ప్రాచీ 98.5 శాతం మార్కులతో.. 600 మార్కులకు గానూ 591 మార్కులు సాధించింది. ఈ విషయం నెట్టింట వైరల్‌ అవ్వడంతో.. నిన్న మొన్నటి వరకు తనను ట్రోల్‌ చేసి అవమానించారో వారితోనే శభాష్‌ అనిపించుకుంది. మరిన్ని విజయాలు సాధించాలని ఆశీస్సులు పొందింది. నెటిజన్లు ఆమెకు మద్దతు ఇవ్వడమే గాకుండా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలి ప్రాచీ అని ప్రోత్సహించారు. ఆరోగ్య పరంగా ముఖంపై వచ్చే ఇలాంటి వాటితో నీలాంటి ఎందరో అమ్మాయిలు ఎగతాళికి గురవ్వుతున్నారు. వారందరికీ నీ గెలుపు ఒక ఆదర్శం అని ప్రాచీని పొగడ్తలతో ముంచెత్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!