Viral: గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.. ఆ తర్వాత.?
ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన పదేళ్లలోపు బాలుడు ఆడుకుంటూ తమ ఇంటికి ఎదురుగా ట్రాక్‌పైన ఆగివున్న గూడ్సురైలు కిందికి వెళ్లాడు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన పదేళ్లలోపు బాలుడు ఆడుకుంటూ తమ ఇంటికి ఎదురుగా ట్రాక్‌పైన ఆగివున్న గూడ్సురైలు కిందికి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే రైలు కదిలిపోయింది. బాలుడు బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హర్దోయ్ స్టేషన్‌కు చేరుకుంది.
స్టేషన్‌లో రైలు సిబ్బంది తనిఖీలు చేస్తుండగా బాలుడిని చూసి షాకయ్యారు. వారు వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాలుడిని జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం హర్దోయ్‌లోని చైల్డ్‌కేర్ సెంటర్‌కు తరలించారు. బాలుడి కుటుంబం లక్నో-అలంనగర్ రాజాజీపూర్‌లోని బాలాజీ మందిర్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తెలిసింది. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చే చర్యలు చేపట్టారు ఆర్‌పీఎఫ్ పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!