తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..

తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..

Phani CH

|

Updated on: Jan 10, 2023 | 9:33 AM

స్కూల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్‌ చెకింగ్‌లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు.

స్కూల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ ఉన్నతాధికారులు సడెన్‌ చెకింగ్‌లు చేయడం సాధారణమే. కానీ అక్కడ ఉన్న ఉద్యోగుల నైపుణ్యలను తెలుసుకునే భాగంలో వారిని వివిధ రకాలు పరీక్షలు పెడుతుంటారు. అయితే ఆ సమయంలో సదరు ఉద్యోగి విజయవంతంగా గెలిస్తే పర్వాలేదు.. కానీ అనుకోని ఘటన జరిగితే ఇక అంతే సంగతులు. అచ్చం అలాంటి ఘటననే ఒకటి ఉన్నతాధికారి ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఒక పోలీసుని తుపాకీని లోడ్‌ చేయమని ఉన్నతాధికారి ఆదేశించారు. అంతేగాదు తుపాకినీ తీసుకువచ్చి లోడ్‌చేసి చూపించమంటే సదరు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తత్తరపాటుకు గురయ్యాడు. ఫిరంగి మాదిరిగా బుల్లెట్‌ పెట్టడంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ ఇన్‌స్పెక్టర్‌ పరిస్థితిని చూసి మొదటగా షాక్‌కి గురి అయ్యారు సదరు ఉన్నతాధికారి. కానీ అతని స్థితిని చూసి నవ్వును ఆపుకుంటూ ఎలా చేయాలో వివరించాడు. చివరికీ ఆ అధికారి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వమని అత్యవసర పరిస్థితుల్లో ఎలా నిర్వహించాలో నేర్చుకోమని సూచించారు. అయితే సదరు ఇన్‌స్పెక్టర్‌పై ఏదైన చర్య తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు.. భయం భయంగా జనాలు..

మసీదులో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోతారు !!

ఒంటిపై బట్టలు లేకున్నా.. అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు

క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..

హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేసిన వ్యక్తి.. ప్లేట్‌లో కనిపించింది చూసి షాక్‌..

 

Published on: Jan 10, 2023 09:33 AM