Leave Letter: భార్య అలక తీర్చేందుకు 10 రోజులు సెలవు కోరిన పోలీస్.. ఫైనల్ గా లీవ్ ఓకే. కానీ..
తాజాగా ఓ పోలీసు అధికారి తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లేందుకు లీవ్ కావాలంటూ ఎస్పీకి లేఖ రాసారు. ఆ లేఖ చూసి ఎస్పీ తగ నవ్వుకున్నారు. ఎందుకంటే పెళ్లయిన 22 ఏళ్లనుంచి అతని భార్య...
పోలీసులు, సైనికులు దేశరక్షణ, శాంతిభద్రతల కోసం అహర్నిశలూ పనిచేస్తారు. అందుకు వారు కుటుంబాలను సైతం త్యాగం చేసి విధినిర్వహణలో శ్రమిస్తారు. సాధారణంగా ఏ ఉద్యోగికైనా పెళ్లియిన తర్వాత తమ కుటుంబం కోసం ఎక్కవ సమయం కేటాయించడం కష్టమే. ఇక పోలీసు ఉద్యోగులకైతే చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ పోలీసు అధికారి తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లేందుకు లీవ్ కావాలంటూ ఎస్పీకి లేఖ రాసారు. ఆ లేఖ చూసి ఎస్పీ తగ నవ్వుకున్నారు. ఎందుకంటే పెళ్లయిన 22 ఏళ్లనుంచి అతని భార్య హోళీ పండకి తనను పుట్టింటి తీసుకెళ్లమని కోరుతుందట. విధినిర్వహణ కారణంగా అతనికి వీలుకాలేదట. అయితే ఈసారి సదరు ఇన్‌స్పెక్టర్ భార్య తీవ్రంగా అలిగిందట. అంతేకాదు ఈసారి ఎలాగైనా తనను దగ్గరుండి పుట్టింటికి తీసుకెళ్లాల్సిందేనని భీష్మించుకు కూచుందట. చేసేది లేక ఆ ఎన్‌స్పెక్టర్ తన గోడు విన్నవిస్తూ తన భార్య అలక తీర్చేందుకు తనకు 10 రోజులు లీవు కావాలంటూ లేఖ రాసారట. అయితే సదరు ఆఫీసర్ బాధను అర్థం చేసుకున్న ఎస్పీ అతనికి 5 రోజులు సెలవు ఇచ్చారట. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ లీవ్ లెటర్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!