కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో

కానిస్టేబుల్ మానవత్వం చూసి.. మనసున్న మా రాజు అంటున్న నెటిజెన్స్.. మనసును హత్తుకుంటున్న వీడియో

Phani CH

|

Updated on: Jun 21, 2022 | 9:45 AM

మానవత్వం కనుమరుగై పోతున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ మూగజీవాల కోసం పరితపిస్తున్నాడు. వాటికి ఆహారం అందిస్తూ నోరులేని వానరాలకు నేస్తంగా మారాడు.


మానవత్వం కనుమరుగై పోతున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ మూగజీవాల కోసం పరితపిస్తున్నాడు. వాటికి ఆహారం అందిస్తూ నోరులేని వానరాలకు నేస్తంగా మారాడు. జంతువుల పట్ల సానుభూతి చూపే ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కోతుల పట్ల ఔదార్యం ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోలో కానిస్టేబుల్‌ కోతులకు మామిడి పండ్లను తినిపిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిని కానిస్టేబుల్‌ మోహిత్‌ యూనిఫామ్‌తో తన జీపులో కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ఓ కోతి తనవీపు మీద కోతిపిల్లను ఎత్తుకుని ఉంది. మోహిత్‌ తన చేతిలో మామిడిపండు కట్‌చేసి కోతికి అందించాడు. అది తీసుకున్న తల్లి కోతి తన బిడ్డతో పాటు అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మరో ముక్కను కోసి కాస్త దూరంగా ఉన్న కోతికి విసిరాడు. ఆకలితో అలమటిస్తున్న వానరాలకు పోలీస్ కానిస్టేబుల్‌ పండ్లు తినిపిస్తున్న ఈ వీడియో నెట్టిజన్ల మనసు గెలుచుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రితో మెగాస్టార్‌ జ్ఞాపకాలు

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్

Prakash Raj : సాయి పల్లవి వివరణపై స్పందించిన మోనార్క్‌..

Published on: Jun 21, 2022 09:44 AM