Lottery: లాటరీలో రూ.10 వేల కోట్లు గెల్చుకున్నాడు కానీ.. అతననెవరో తెలియదు.. ఇప్పుడు రూ.10 వేల కోట్లు పరిష్టితి ఏంటి..?
అదృష్టం ఎప్పుడు..ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. కొందరికి అదృష్టం వరించినా అందుకునే అవకాశం ఉండదు. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా లాటరీలో 10,136 కోట్లు గెలుచుకున్నాడు. కానీ...
అదృష్టం ఎప్పుడు..ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. కొందరికి అదృష్టం వరించినా అందుకునే అవకాశం ఉండదు. తాజాగా అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా లాటరీలో 10,136 కోట్లు గెలుచుకున్నాడు. కానీ అతనెవరనేది తెలియకపోవడం కొసమెరుపు. ఇప్పుడు ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో మెగా మిలియన్స్ అనే సంస్థ నిర్వహించిన లాటరీలో ఓ వ్యక్తి రెండు డాలర్లు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ రెండు డాలర్లు అతన్ని కోటీశ్వరుడ్ని చేశాయి. అతనికి ఏకంగా 1.28 బిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో 10,136 కోట్ల జాక్‌పాట్ తగిలింది. లాటరీ కొట్టిన ఈ టికెట్ వివరాలను ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ టికెట్ అమ్ముడైనట్టు మెగా మిలియన్స్ తెలిపింది. అయితే, ఆ వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని తెలిపింది. ప్రభుత్వ ఆధర్యంలో నిర్వహించే ఈ లాటరీలో 2015 నుంచి జరిగిన 29 డ్రాలలో ఇప్పటి వరకూ ఒక్కరు కూడా జాక్‌పాట్ కొట్టిన దాఖలాలు లేవు. తాజాగా ఓ వ్యక్తికి ఆ అదృష్టం పట్టింది. అంతేకాదు, అమెరికాలో గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద జాక్‌పాట్ అంటున్నారు. అంతేకాదు, ఆ దేశ చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద జాక్‌పాట్ అట. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎక్కడున్నాడో ఆ అదృష్టవంతుడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..