AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశీ టీవీ ఛానెళ్లు చూస్తే.. ఉరే.. వీడియో

విదేశీ టీవీ ఛానెళ్లు చూస్తే.. ఉరే.. వీడియో

Samatha J
|

Updated on: Sep 14, 2025 | 4:37 PM

Share

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ఆంక్షలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. కొవిడ్‌ టైంలో.. తమ దేశానికి చెందిన ఓ వ్యక్తికి కోవిడ్‌ సోకిందని అతడిని కాల్చి చంపేశాడంటే కిమ్‌ నియంతృత్వ పాలన ఎంత కఠినమైందో అర్ధమవుతుంది. తాజాగా కిమ్‌ దేశీయ చట్టాలను మరింత కఠినతరం చేశారు. విదేశీ టీవీ సీరియల్స్ చూసినా, షేర్ చేసినా ఉరి వేసేలా అక్కడి చట్టాలను మార్చారు. దీంతో.. ఉత్తర కొరియాలో మానవ హక్కుల అణచివేత తీవ్రస్థాయికి చేరిందని, ప్రపంచంలో మరెక్కడా లేనంత కఠిన ఆంక్షల మధ్య ప్రజలు జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది.

ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అత్యంత దారుణమైన నేరాలు జరుగుతున్నాయని 2014లో ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక ఇచ్చింది. అయితే.. ఆ తర్వాతి నుంచి 2024 మధ్య కాలంలో అక్కడి పరిస్థితులు మెరుగుపడకపోగా.. మరింత దిగజారాయని తాజా నివేదికలో వెల్లడైంది. ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి సేకరించిన వివరాలను తాజా నివేదికలో ప్రస్తావించారు. కొత్త టెక్నాలజీ సాయంతో ప్రజల ప్రతి కదలికపైనా నిఘా తీవ్రతరం చేశారని, శిక్షలను మరింత కఠినతరం చేశారని నివేదిక పేర్కొంది. 2015 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపైనా ప్రభుత్వ నియంత్రణ పెరిగిపోయిందని తెలిపింది. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ప్రపంచంలో మరే దేశ ప్రజలు కూడా ఇంతటి కఠినమైన ఆంక్షల కింద జీవించడం లేదంటూ 14 పేజీల నివేదికను ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం :

దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో

టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో

153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో