AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ.. విరిగిన ఎముకలు అతకడం ఇక ఈజీ వీడియో

చైనా పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ.. విరిగిన ఎముకలు అతకడం ఇక ఈజీ వీడియో

Samatha J
|

Updated on: Sep 14, 2025 | 4:36 PM

Share

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో.. ఎక్సర్‌సైజు చేస్తున్నప్పుడో అనుకోకుండా ఎముకలు విరుగుతూ ఉంటాయి. ఇక విరిగిన ఎముకలను అతికించాలంటే శస్త్ర చికిత్స చేసి రాడ్స్‌ వేయడం చేస్తుంటారు. అది నయమవడానికి చాలా సమయం పడుతుంది.. ఖర్చుతో కూడుకున్నది కూడా. అలా కాకుండా ఎంచక్కా ఫెవిక్విక్‌ లాంటి గమ్‌తో నిమిషాల్లో అతికించేస్తే ఎంత బావుంటుంది.. కదా.. ఇదే ఆలోచన చైనా శాస్త్రవేత్తలకు వచ్చినట్టుంది. అందుకే .. విరిగిన ఎముకలను అతికించడానికి గంటల తరబడి సాగే శస్త్రచికిత్సలు, స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. కేవలం మూడు నిమిషాల్లోనే సరిచేసే ఒక ప్రత్యేకమైన 'బోన్ గ్లూ'ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆర్థోపెడిక్స్ విభాగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

తూర్పు చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్‌కు చెందిన పరిశోధకులు ‘బోన్ 02’ పేరుతో ఈ సరికొత్త జిగురును తయారుచేశారు. సముద్రంలోని ఆల్చిప్పలు నీటి అడుగున దేనికైనా బలంగా అతుక్కుపోయే గుణం నుంచి ప్రేరణ పొంది దీన్ని రూపొందించడం విశేషం. ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన సర్ రన్ రన్ షా ఆసుపత్రి అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ లిన్ షాన్‌ఫింగ్ ఈ ఆవిష్కరణ వివరాలను పంచుకున్నారు. “మేము కొత్తగా అభివృద్ధి చేసిన ఈ గ్లూ, కేవలం రెండు లేదా మూడు నిమిషాల్లోనే విరిగిన ఎముకలను అతికిస్తుంది. తీవ్రమైన రక్తస్రావం జరుగుతున్న ప్రదేశంలో కూడా ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది” అని ఆయన వివరించారు.సాంప్రదాయ పద్ధతుల్లో ఎముకల ఆపరేషన్ చేయాలంటే రోగి శరీరానికి పెద్ద కోత పెట్టి, లోపల స్టీల్ ప్లేట్లు లేదా రాడ్లు అమర్చాల్సి ఉంటుంది. ఇది రోగికి తీవ్ర నొప్పితో పాటు, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, ఈ కొత్త బోన్ గ్లూను ఒక సూది ద్వారా సులభంగా విరిగిన ప్రదేశంలోకి ఇంజెక్ట్ చేయవచ్చు. దీనివల్ల పెద్ద కోతల అవసరం ఉండదు, ఆపరేషన్ సమయం గణనీయంగా తగ్గుతుంది. నీరు, రక్తం ఉన్న చోట కూడా ఇది తన పటుత్వాన్ని కోల్పోకుండా ఎముకల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో ఆర్థోపెడిక్ చికిత్సల స్వరూపాన్నే మార్చేస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు నొప్పిలేని, సులభమైన చికిత్స అందించి, వారు త్వరగా కోలుకునేందుకు ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, దీని భద్రతను, ప్రభావాన్ని పూర్తిగా నిర్ధారించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో

టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో

153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో