AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. పిట్టను కాల్చినట్టు కాల్చి పడేశాడు వీడియో

మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. పిట్టను కాల్చినట్టు కాల్చి పడేశాడు వీడియో

Samatha J
|

Updated on: Sep 14, 2025 | 4:35 PM

Share

కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై పిట్టను కాల్చినట్టు కాల్చి పడేశాడు ఓ భర్త. మోసగించి పెళ్ళి చేసుకున్నదే కాకుండా తరచూ ఆమెను వేధించడంతో పోలీసులను ఆశ్రయించింది. తనపై కేసు పెట్టిందనే కోపంతో భార్యను దారుణంగా కాల్చిచంపాడు సదరు భర్త. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు నిశ్చేష్ఠులయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గ్వాలియర్‌లో రూప్ సింగ్ స్టేడియం వద్ద జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

అరవింద్ పరిహార్ అనే ఓ వ్యక్తి తన భార్య నందినిని నడిరోడ్డుపై తుపాకీతో దారుణంగా కాల్చి చంపాడు. ఊహించని ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు భార్యను చంపి పారిపోకుండా గన్‌ పట్టుకొని మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నాడు. సమీపానికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. భయంతో పరుగులు తీశారు. కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగానే, నిందితుడు పిస్టల్ చూపించి పోలీసులను సైతం బెదిరించాడు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, ఎంతో శ్రమపడి అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వివరాలు ప్రకారం.. నిందితుడు అరవింద్‌.. నందినికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త వేధింపులు భరించలేక గతేడాది సెప్టెంబరు 9న నందిని ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. అరవింగ్‌ తనను మోసగించి పెళ్లి చేసుకోవడమే కాకుండా రోజూ కొడుతూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం :

దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో

టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో

153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో