ఇది బ్రిటిష్‌ మిర్చి బజ్జీ.. గుంటూరు మిర్చిని మించి !!

ఇది బ్రిటిష్‌ మిర్చి బజ్జీ.. గుంటూరు మిర్చిని మించి !!

Phani CH

|

Updated on: Dec 21, 2022 | 7:12 PM

బ్రిటన్‌కు చెందిన జాక్‌ డ్రేన్‌ అనే వ్యక్తికి భారతీయ వంటకాలంటే ఎంతో ఇష్టం. అతని ఇన్‌స్టాలో చూస్తే అన్నీ ఇండియన్‌ డిషెస్సే కనిపిస్తాయి. తాజాగా అతను మిర్చి బజ్జీ తయారు చేశాడు.

బ్రిటన్‌కు చెందిన జాక్‌ డ్రేన్‌ అనే వ్యక్తికి భారతీయ వంటకాలంటే ఎంతో ఇష్టం. అతని ఇన్‌స్టాలో చూస్తే అన్నీ ఇండియన్‌ డిషెస్సే కనిపిస్తాయి. తాజాగా అతను మిర్చి బజ్జీ తయారు చేశాడు. అతను చేసిన మిర్చి బజ్జీ చూసి నెటిజన్ల నోట్లో నీళ్ళూరాయంటే నమ్మండి. జాక్‌ డ్రేన్‌ తయారు చేసిన మిర్చి బజ్జీ వంటకం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జాక్‌ డ్రేస్‌ మిర్చిలను మధ్యలోకి కట్‌ చేసి, వాటిలో ఉడకబెట్టిన బంగాళాదుంపను పేస్ట్‌ చేసి, దానిలో కారం, కొద్దిగా మసాలా కలిపి మిర్చిలో స్టఫ్‌గా పెట్టాడు. దానిని శనగపిండిలో ముంచి ప్యాన్‌లో డీప్‌ ఫ్రై చేశాడు. తర్వాత వాటిని గోల్డెన్ క‌ల‌ర్‌ వచ్చేలా దోర‌గా వేయించాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘మిర‌ప‌కాయ‌ల్లో ఆలూ మ‌సాలా స్టఫ్ చేసి శ‌న‌గ‌పిండిలో ముంచి!!!’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.

Published on: Dec 21, 2022 07:12 PM