Smartwatch: గుండెపోటుకు గురైన సీఈవోను కాపాడిన స్మార్ట్‌వాచ్.. ఎలా అనుకుంటున్నారా.?
చేతికి కట్టుకునే స్మార్ట్‌వాచ్ ఓ కంపెనీ సీఈవో ప్రాణాల్ని కాపాడింది. యూకేకి చెందిన 42 ఏళ్ల పాల్ వాఫమ్ .. హాకీ వేల్స్ అనే కంపెనీకి సీఈవో. అతడు నిత్యం ఉదయం పూట జాగింగ్‌కు వెళ్తుంటాడు. అలా ఇటీవలే జాగింగ్‌కు వెళ్లాడు. అయితే, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాసేపటికే ఛాతిలో నొప్పితో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఇక వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ ద్వారా ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు.
చేతికి కట్టుకునే స్మార్ట్‌వాచ్ ఓ కంపెనీ సీఈవో ప్రాణాల్ని కాపాడింది. యూకేకి చెందిన 42 ఏళ్ల పాల్ వాఫమ్ .. హాకీ వేల్స్ అనే కంపెనీకి సీఈవో. అతడు నిత్యం ఉదయం పూట జాగింగ్‌కు వెళ్తుంటాడు. అలా ఇటీవలే జాగింగ్‌కు వెళ్లాడు. అయితే, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాసేపటికే ఛాతిలో నొప్పితో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఇక వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ ద్వారా ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఐదు నిమిషాల వ్యవధిలోనే సీఈవో భార్య అక్కడికి చేరుకుని అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు సైతం సరైన సమయంలో వైద్యం అందించడంతో సీఈవో ప్రాణాలు నిలిచాయి. గుండె ధమనుల్లో ఒకటి పూర్తిగా బ్లాక్ కావడంతో ఇలా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేశారు. చికిత్స అనంతరం ఆరు రోజుల తర్వాత సీఈవో ఇంటికి చేరుకున్నాడు. డిశ్చార్జై ఇంటికి చేరిన పాల్.. తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశాడు. తను రోజూలాగే ఉదయం 7 గంటలకు మార్నింగ్ వాక్‌కు వెళ్లానని ఐదు నిమిషాల్లోనే తన ఛాతి బిగుతుగా అనిపించిందని వెంటనే విపరీతమైన నొప్పి మొదలు కావడంతో రోడ్డుపైనే పడిపోయానని తెలిపారు. వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ సాయంతో తన భార్య లారాకు ఫోన్ చేయగా అదృష్టవశాత్తు ఇంటికి ఐదు నిమిషాల దూరమే కావడంతో తను అక్కడికి చేరుకుని కారులో ఆసుపత్రికి తీసుకెళ్లిందని చెప్పారు.
వైద్యులు కూడా సకాలంలో స్పందించడంతో ప్రాణాలు దక్కాయని ఇలా జరగడం తనకే కాదు, తన కుటుంబ సభ్యులను కూడా షాక్‌కు గురి చేసిందని చెప్పుకొచ్చారు. స్మార్ట్‌వాచ్‌ల పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రకాల అధునాతన ఫీచర్లు ఉండటంతో.. వాటిని చాలా మంది విలాసవంతమైన వస్తువులుగా పరిగణిస్తారు. ఈ వాచ్‌లు కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే కాదు.. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అలా ఇప్పటికే చాలా మంది వీటి కారణంగా ప్రాణాలు దక్కించుకోగలిగారు. గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించడంతో చాలా మంది ప్రాణాలతో బయటపడిన సందర్భాలు అనేకం. స్మార్ట్ వాచ్‌లో ఉండే హార్ట్ రేట్ ఈసీజీ, వంటి సెన్సర్లు గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.