Uber Driver: నాకు నిద్దరొస్తుంది.. ప్లీజ్.. !డ్రైవర్ నిజాయతీకి పలు రకాలుగా కామెంట్స్ వెల్లువ..
ఇటీవల ఇంటినుంచి బయటకు వెళ్లాలంటే చాలా ఈజీ అయిపోయింది. టకటకా రెడీ అవ్వాలి.. ఉబరో, ర్యాపిడోనో బుక్ చేసుకొని లగెత్తాలి..అంతే.. అర్ధరాత్రి లేదు.. మిట్టమద్యాహ్నం లేదు.. ఎప్పడైనా క్యాబ్,
ఇటీవల ఇంటినుంచి బయటకు వెళ్లాలంటే చాలా ఈజీ అయిపోయింది. టకటకా రెడీ అవ్వాలి.. ఉబరో, ర్యాపిడోనో బుక్ చేసుకొని లగెత్తాలి..అంతే.. అర్ధరాత్రి లేదు.. మిట్టమద్యాహ్నం లేదు.. ఎప్పడైనా క్యాబ్, ర్యాపిడో డ్రైవర్లు రెడీగా ఉంటారు. అలా క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. క్యాబ్ బుక్ చేసుకున్నాక అంతా ఓకే చెప్పి, చివరి నిమిషంలో నేను రాలేను పొమ్మన్నాడు క్యాబ్ డ్రైవర్ దాంతో ఆ మహిళ ఏంచేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది.బెంగళూరులో ఆషి అనే మహిళ అర్ధరాత్రి ఒంటి గంటకు ఉబెర్ యాప్ లో క్యాబ్ బుక్ చేశారు. తొలుత రైడ్ ను అంగీకరించిన ఉబెర్ డ్రైవర్, కాసేపటికి రైడ్ రద్దు చేసుకోవాలంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. తనకు నిద్ర వస్తోందని చెబుతూ రైడ్ క్యాన్సిల్ చేసుకోవాలని కోరాడు. ఆ డ్రైవర్ నిజాయితీగా చెప్పడంతో తాను సరేనంటూ మెసేజ్ చేసి, ఆ రైడ్ ను రద్దు చేసుకున్నానని వివరించారు. ఆషి ఈ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పెట్టారు. దీనిపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. డ్రైవర్ నిజాయతీని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..