ఊహించని షాక్.. పక్షి చేసిన పనికి ప్రాణాలే పోయేవి..
మృత్యువు ఏ రూపంలో కబళిస్తోందో ఎవ్వరూ ఊహించలేరు.. అప్పటివరకు నవ్వుతున్న వ్యక్తులు సైతం.. కళ్ల ముందే ప్రాణాలుపోతున్న ఘటనలు అనేకం.
మృత్యువు ఏ రూపంలో కబళిస్తోందో ఎవ్వరూ ఊహించలేరు.. అప్పటివరకు నవ్వుతున్న వ్యక్తులు సైతం.. కళ్ల ముందే ప్రాణాలుపోతున్న ఘటనలు అనేకం. తాజాగా.. ఓ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో సరదాగా మరొక వ్యక్తితో మాట్లాడుతున్న టీటీఈకి కరెంట్ వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కొనఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన అందరినీ ఆందోళనకు గురిస్తోంది. ఓ పక్షి గూడు కోసం పొడవైన వైర్ తీసుకెళ్తోంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకోగానే.. ఆ వైర్ హైవోల్టేజీ విద్యుత్ లైన్‌కు తగిలింది. ప్లాట్‌ఫామ్ అంచున నిల్చొని ఉన్న రైల్వే ఉద్యోగికి ఆ వైర్ తగిలింది. దీంతో టీటీఈ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫ్లాట్‌ఫామ్ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాలపై పడిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారంతా పరుగులు తీశారు. అనంతరం టీటీఈని ఫ్లామ్‌ఫామ్‌పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ ఆ టీటీఈకి ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరికాసేపట్లో పెళ్లి.. అది నచ్చలేదంటూ పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..
మీరు గొప్పోళ్లు భయ్యా.. పెళ్లి కూతురుని ఇలాకూడా తీసుకొస్తారా !!
చిన్నిబాలుడి మంచిమనసు.. మేకపిల్లకు చలేస్తుందని ఏం చేసాడంటే ??
ఫిఫా ఫీవర్.. మ్యాచ్ చూస్తూ ఆపరేషన్.. మరీ ఇంత పిచ్చి పనికిరాదంటున్న నెటిజెన్స్
టవల్, బనియన్ ధరించి మెట్రోలో ప్రయాణించిన యువకుడు.. నువ్వు నెక్ట్స్ లెవల్ బ్రో అంటున్న నెటిజన్లు