ఫిఫా ఫీవర్.. మ్యాచ్ చూస్తూ ఆపరేషన్.. మరీ ఇంత పిచ్చి పనికిరాదంటున్న నెటిజెన్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ నడుస్తోంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రభావం మామూలుగాలేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ నడుస్తోంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రభావం మామూలుగాలేదు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓ సారి జరిగే ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో తమ అభిమాన టీమ్ కప్ గెలుచుకోవాలని ప్రతి అభిమాని కోరుకుంటుంటాడు. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడం కోసం పోలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన సాహసానికి అందరూ ఆశ్చర్యపోవడమే కాదు.. మరీ అంత పిచ్చి మంచిదికాదంటూ హితవు పలుకుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. పోలండ్‌కు చెందిన ఆ వ్యక్తి తనకు ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కూడా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ను చూస్తూనే ఉన్నాడు. అతను నవంబరు 25న వేల్స్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు ఈ సహసం చేశాడు. ఈ ఘటన పోలాండ్‌లోని కీల్స్‌లో జరిగింది. అయితే తన కోరిక మేరకు ఆపరేషన్ థియేటర్‌లో టీవీని ఏర్పాటు చేసినందుకు సదరు డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఘటనకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టవల్, బనియన్ ధరించి మెట్రోలో ప్రయాణించిన యువకుడు.. నువ్వు నెక్ట్స్ లెవల్ బ్రో అంటున్న నెటిజన్లు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మనిషి.. చెక్కు చెదరని రికార్డ్
వార్నీ.. కొబ్బరికాయను ఇలా కూడా కొడతారా !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

