Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!

|

Sep 14, 2024 | 4:35 PM

పొరుగు దేశం పాకిస్తాన్‌లో బుధవారం భూకంపం.. ప్రజలను తీవ్ర భయకంపితులను చేసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం వణికిపోయారు. ప్రాణభయంతో ఇళ్లు, ఆఫీసులు, భవనాల నుంచి బయటికి పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌లో మాత్రమే కాకుండా పొరుగున ఉన్న భారత్,

పొరుగు దేశం పాకిస్తాన్‌లో బుధవారం భూకంపం.. ప్రజలను తీవ్ర భయకంపితులను చేసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం వణికిపోయారు. ప్రాణభయంతో ఇళ్లు, ఆఫీసులు, భవనాల నుంచి బయటికి పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌లో మాత్రమే కాకుండా పొరుగున ఉన్న భారత్, ఆఫ్గనిస్థాన్ దేశాలలోనూ భూ ప్రకపంనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మన దేశంలో ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ భూకంప ప్రభావం కనిపించింది.

బుధవారం మధ్యాహ్నం 12:58 గంటలకు పాకిస్తాన్‌లో భూకంపం చోటు చేసుకుందని.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ నైరుతి భాగంలో డేరా ఘాజీఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖను ఉటంకిస్తూ పాకిస్తాన్ స్థానిక మీడియా తెలిపింది. ఈ 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్‌ వంటి నగరాల్లో ప్రభావం కనిపించింది. ఇక ఈ పాక్ భూకంపం కారణంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల్లో భూ ప్రకపంనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ భూకంపం సంభవించినట్లు మీడియా వెల్లడించింది. కాగా, భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూన్ నెలలో ఢిల్లీలో భూకంపం రాగా.. నెలల వ్యవధిలోనే మరోసారి భూమి కంపించడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on