Vijayawada: బోట్లను ఒడ్డుకు తెచ్చేదెలా.? ప్లాన్ B సక్సెస్ అవుతుందా.?
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మరోవైపు బోట్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారీ క్రేన్లతో తొలగింపు ప్రక్రియ విఫలం కావడంతో.. ఎయిర్ బెలూన్ల ఆపరేషన్‌ను లాంచ్ చేశారు. మూడు బోట్లు ఒకదానికి ఒకటి చిక్కుకుపోవడంతో వాటిని క్రేన్ల సాయంతో బయటకు తీయలేకపోయారు. దీంతో కింద నుంచి బెలూన్లను అమర్చి పైకి తీసుకు వచ్చే ప్రక్రియ చేపడుతున్నారు.
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. మరోవైపు బోట్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారీ క్రేన్లతో తొలగింపు ప్రక్రియ విఫలం కావడంతో.. ఎయిర్ బెలూన్ల ఆపరేషన్‌ను లాంచ్ చేశారు. మూడు బోట్లు ఒకదానికి ఒకటి చిక్కుకుపోవడంతో వాటిని క్రేన్ల సాయంతో బయటకు తీయలేకపోయారు. దీంతో కింద నుంచి బెలూన్లను అమర్చి పైకి తీసుకు వచ్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఒక్కో పడవ బరువు 40 టన్నులు ఉండడం వల్ల ఈ ప్రక్రియ అంత సులువేం కాదంటున్నారు అధికారులు. ఒక్కో ఎయిర్ బెలూన్ 10 టన్నులు పైకెత్తగలదు కాబట్టి.. అలాంటివి పది నుంచి పన్నెండు బెలూన్లతో ఈ ఆపరేషన్ చేపడుతున్నారు.
ఎయిర్ బెలూన్లతో బోట్లను పైకి ఎత్తిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు. ఆతర్వాత బోటును సగానికి కట్ చేసి.. తరలిస్తారు. ఇలా మూడు బోట్లను పైకెత్తి కట్ చేసి.. బయటకు తీసుకురాడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశముంది. బోట్ల కింద అనుకూల ప్రదేశాన్ని చూసి అక్కడ బెలూన్లను అమర్చి.. బ్యారేజీ పైనుంచి ఎయిర్ పంపింగ్ చేపడతారు. అలా ఎయిర్‌బెలూన్లలో గాలి నిండే కొద్దీ.. బోట్లు పైకి తేలుతాయని అంచనా వేస్తున్నారు. విశాఖ, కాకినాడ నుంచి డైవర్లను తీసుకొచ్చి ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వేగవంతంగా ఈ ప్రక్రియను ముగిస్తామన్నారు. బోట్లు వచ్చిన పరిస్థితి.. అక్కడ ఇరుక్కున్న వ్యవహారం చూస్తుంటే దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు మంత్రి నిమ్మల. దీనివెనుక ఎలాంటి వారున్నా వదలబోమన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

