అదుపు తప్పిన కారు.. సరాసరి రెస్టారెంట్‌లోకి
అతివేగం ప్రమాదకరం.. ప్రాణాలకే పెను ప్రమాదం.. నిదానమే ప్రధానం అంటూ ట్రాఫిక్ పోలీసులు మైకుపెట్టి ఎంత అరిచినా.. ఎన్ని హితబోధలు చేసినా కొందరు పట్టించుకోరు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఈ క్రమంలో వారు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులను ప్రమాదాల్లోకి నెడతారు. ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. అందుకే పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆంక్షలు పెడతారు.
అతివేగం ప్రమాదకరం.. ప్రాణాలకే పెను ప్రమాదం.. నిదానమే ప్రధానం అంటూ ట్రాఫిక్ పోలీసులు మైకుపెట్టి ఎంత అరిచినా.. ఎన్ని హితబోధలు చేసినా కొందరు పట్టించుకోరు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఈ క్రమంలో వారు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులను ప్రమాదాల్లోకి నెడతారు. ఒక్కోసారి ప్రాణనష్టం కూడా సంభవిస్తుంది. అందుకే పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆంక్షలు పెడతారు. సాధారణంగా వాహనాలు అతివేగంగా నడిపినప్పుడు అవి అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతుంటాయి. ఒక్కోసారి డివైడర్లు దాటి అవతలి రోడ్డులో పడుతుంటాయి వాహనాలు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది ఆగ్రాలో. ఆగ్రాలో ఓ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తోంది కారు. ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. కారు అదుపుతప్పింది. సరాసరి ఓ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. ఆగ్రాలోని హల్దీరామ్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేయని నేరానికి పదేళ్ళ జైలు శిక్ష.. రూ.వందల కోట్లలో పరిహారం ఇప్పించిన కోర్టు.
విమానాల్లో ఆ వస్తువులు అతిగా వేడెక్కుతున్నాయ్
యాపిల్ సీఈవోతో ముచ్చటించిన సిద్ధార్థ్, అదితి
అక్కడ తోడేళ్లు… ఇక్కడ నక్కలు.. మనుషులపై దాడులు
ఇకపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!