AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టుకతో అబ్బాయి.. అమ్మాయిగా మారి .. పెళ్ళితో సెన్సేషన్‌

పుట్టుకతో అబ్బాయి.. అమ్మాయిగా మారి .. పెళ్ళితో సెన్సేషన్‌

Phani CH
|

Updated on: Mar 13, 2023 | 9:30 PM

Share

థాయ్‌లాండ్ లో మెస్ట్‌ పాపులర్‌ ట్రాన్స్‌జెండర్, సినీతార కూడా అయిన పోయిడ్ ట్రిచాడ తాజాగా సెన్సేషన్‌గా మారారు. పుకెట్ ప్రావిన్స్‌కు చెందిన బడా వ్యాపారవేత్త హ్యాంగ్యోక్‌ను పెళ్లాడారు.

థాయ్‌లాండ్ లో మెస్ట్‌ పాపులర్‌ ట్రాన్స్‌జెండర్, సినీతార కూడా అయిన పోయిడ్ ట్రిచాడ తాజాగా సెన్సేషన్‌గా మారారు. పుకెట్ ప్రావిన్స్‌కు చెందిన బడా వ్యాపారవేత్త హ్యాంగ్యోక్‌ను పెళ్లాడారు. 36 ఏళ్ల పోయిడ్ అద్భుతమైన అందంతో సూపర్ మోడల్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాలో ఆమెకు 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. థాయ్‌లాండ్‌లోని ఫెంగ్‌నాలో 1986లో పోయిడ్ జన్మించారు. మగబిడ్డగా పుట్టినప్పటికీ పెద్దయ్యాక అమ్మాయి లక్షణాలు కనిపించడంతో పదిహేడేళ్ల వయసులో లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. 2010లో ‘విత్ లవ్’ సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ‘స్పైసీ బ్యూటీ క్వీన్ బ్యాంకాక్-2’ ఫిల్మ్ సిరీస్‌లో ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఆరేళ్లలో ఆరు సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వలలో చిక్కి విలవిలలాడిన కాకి.. బాలుడు ఏంచేశాడంటే ??

ఆమ్మాయిల లోదుస్తులకు అబ్బాయిల ప్రచారం !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

అమ్మ బాబోయ్.. వరుడు చూపిన ప్రేమకు వధువు కూడా ఫిదా

దాహంతో అల్లాడిన పిచ్చుక.. అతనేం చేశాడంటే ??

ఈ పాన్ ధర అక్షరాలా లక్ష రూపాయలు.. ప్రియురాలు మీద ప్రేమ ఉన్న వారు ఈ పాన్ వద్దనలేరు

 

Published on: Mar 13, 2023 09:29 PM
Follow Us