ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??
ట్రాన్స్-సైబీరియన్ రైల్వే రష్యాలో మాస్కో నుండి వ్లాడివోస్టాక్ వరకు విస్తరించిన ప్రపంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. 9,289 కి.మీ.ల ఈ ప్రయాణంలో సైబీరియా మంచు పర్వతాలు, అటవీ ప్రాంతాలు, వోల్గా నది, బైకాల్ సరస్సు వంటి అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇది పర్యాటకంతో పాటు దేశ వాణిజ్యానికి కీలకమైన మార్గం.
ట్రాన్స్‌సైబీరియన్ రైల్వే లైన్.. ప్రపంచంలో అతిపెద్ద దేశమైన రష్యాలో.. తూర్పు-పశ్చిమ దిక్కులను కలుపుతూ ‘ట్రాన్స్-సైబీరియన్ రైల్వే లైన్’ సేవలు అందిస్తోంది. మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు ఈ లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు.. 8 టైమ్ జోన్స్.. 80కి పైగా రైల్వేస్టేషన్ల మీదుగా.. 8 రోజుల్లో 9,289 కిలోమీటర్లు ప్రయానిస్తాయి. అయితే రైలు ప్రయాణంలో నగరాలు, గ్రామాలు, సైబీరియా మంచు పర్వతాలు-మైదానాలు, విస్తారమైన అడవులు.. వోల్గాతో పాటు ఇతర నదులు కనువిందు చేస్తాయి. రష్యాలోని వివిధ ప్రాంతాల సంస్కృతిని తెలుసుకోవచ్చు. ఈ రైలు మార్గంలో ప్రయాణించేవారు సరికొత్త అనుభూతిని పొందుతారు. ప్రపంచంలోనే అత్యంత లోతైన బైకాల్ సరస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రైల్వే నిర్మాణాన్ని 1891లో అప్పటి రష్యా చక్రవర్తి అలెగ్జాండర్ ద థర్డ్ ఆదేశాలతో ప్రారంభించారు. ఆయన కుమారుడు నికొలస్ ద సెకండ్ కూడా దీని నిర్మాణాన్ని పర్యవేక్షించారు. 1916లో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టు హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది ఈ ప్రాజెక్టుపై డాక్యుమెంటరీలు నిర్మించారు. ఈ రైల్వే లైన్ ఆదాయం తెచ్చిపెట్టడమే కాదు.. వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడుతోంది. ప్యాసింజర్ రైళ్లతోపాటు భారీ సంఖ్యలో కంటైనర్లతో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అలా ఈ మార్గం పశ్చిమతీరంలోని పరిశ్రమలను తూర్పున ఉన్న నౌకాశ్రయాలతో కలుపుతూ.. ఎగుమతులు, దిగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. యాంకర్ భారత్‌లో కూడా సుదీర్ఘ ప్రయాణమున్న ఓ రైలు మార్గముంది. అదే అస్సాంలోని డిబ్రుఘడ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి మధ్య వివేక్ ఎక్స్‌ప్రెస్. ఈ రెండు రైల్వేస్టేషన్ల మధ్య దూరం 4,218 కిలోమీటర్లు. నాలుగు రోజులు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ రైలు ఎనిమిది రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. దాదాపు 58 స్టేషన్లలో ఆగుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి
స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్
రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు
