Viral Video: మనకు ఏ పని అయితే కేటాయించారో అంత వరకు చేస్తే సరిపోతుంది అనే భావలో ఉంటారు చాలా మంది. నాది కాని పని చేస్తే నాకేంటి లాభమనేంతలా కమర్షియల్‌గా మారిపోయాయి మనిషి జీవితాలు. అయితే ఇలాంటి కమర్షియల్ ప్రపంచంలోనూ కొందరు నిస్వార్థపరులు ఉంటారు. పక్కవారి మేలు కోసం ఇతరుల పనిని సైతం తమ భుజాన వేసుకుంటున్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోనే దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.
ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన అవనీశ్ శరణ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేసిన వీడియో అందరితో హ్యాట్సాఫ్ చెప్పిస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే పనిలో ఓ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. ఇదే సమయంలో రోడ్డుపై కంకర పడి ఉండడానికి గమనించాడు. కంకరపై నుంచి ద్విచక్రవాహనాలు వెళితే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుందని పసిగట్టాడు. అయితే రోడ్డుపై కంకరను తీయడం తన పని కాదని తెలిసినా.. ఒక్క నిమిషం మానవత్వంతో ఆలోచించాడు.
ఎదుటి వారి మేలును కోరి వెంటనే చీపురును చేత పట్టి కంకరను పక్కకు ఊడ్చాడు. దీనంతటికీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త తెగ వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సదరు ట్రాఫిక్ పోలీస్ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ పోలీస్ అధికారి వెనకాలే నిల్చొని వాహననాలకు డైరెక్షన్ ఇచ్చిన మరో వ్యక్తిపై కూడా పొగడ్తలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి నెట్టిం వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Respect for You.? pic.twitter.com/Bb5uZktpZk
— Awanish Sharan (@AwanishSharan) June 16, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..