Traffic Challan: చలాన్ల విషయంలో ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం.! ఇకపై నేరుగా..

|

Sep 04, 2024 | 8:59 AM

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించడం సర్వసాధారణమైన విషయం. ఒకప్పటిలా వాహనాలను ఆపి చలానా వసూలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా హైటెక్‌. ట్రాఫిక్‌ పోలీస్ ఎక్కడో నిల్చోని.. హెల్మెట్‌ ధరించకపోయినా, రాంగ్‌ రూట్‌లో వెళ్లినా కెమెరాలో క్లిక్ మనిపించి చలాన్‌ వేస్తున్నారు. అయితే మన వాహనానికి చలానా పడిందా.? లేదా అన్ని విషయం తెలియాలంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాహనం నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకునే వాళ్లం.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించడం సర్వసాధారణమైన విషయం. ఒకప్పటిలా వాహనాలను ఆపి చలానా వసూలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా హైటెక్‌. ట్రాఫిక్‌ పోలీస్ ఎక్కడో నిల్చోని.. హెల్మెట్‌ ధరించకపోయినా, రాంగ్‌ రూట్‌లో వెళ్లినా కెమెరాలో క్లిక్ మనిపించి చలాన్‌ వేస్తున్నారు. అయితే మన వాహనానికి చలానా పడిందా.? లేదా అన్ని విషయం తెలియాలంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాహనం నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకునే వాళ్లం. ఇకపై అలా కాకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ రవాణా శాఖ సన్నాహాలు చేస్తోంది. వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమిస్తే.. వేంటనే నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్‌లు పంపించే విధానాన్ని తీసుకురానున్నారు. అంతే కాకుండా చలాన్లు సులభంగా చెల్లించేందుకు వీలుగా.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, తదితర యాప్స్‌ద్వారా చెల్లించేలా ఆప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. వాట్సాప్‌ లేదా మెసేజ్‌ రూపంలో చలానా పంపించి, యూపీఐ విధానంలో చలాన్లు చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.