Sun: రెండుగా చీలిన సూర్యుడు..! సూర్యుడిపై విచ్ఛిన్నమైన అతి పెద్ద భాగం.. వీడియో.
అనుక్షణం భగభగలాడే సూర్యుడు ఖగోళ శాస్త్రవేత్తలకు అత్యంత ఆసక్తికరమైన అంశం. తాజాగా సూర్యుడి ఉపరితలంపై జరిగిన ఓ పరిణామం పరిశోధకులను ఉలిక్కిపడేలా చేసింది.
అనుక్షణం భగభగలాడే సూర్యుడు ఖగోళ శాస్త్రవేత్తలకు అత్యంత ఆసక్తికరమైన అంశం. తాజాగా సూర్యుడి ఉపరితలంపై జరిగిన ఓ పరిణామం పరిశోధకులను ఉలిక్కిపడేలా చేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం విడిపోయినట్టు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అంతరిక్ష శాస్త్రవేత్త డా తమిత స్కోవ్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. సూర్యుడి ఉపరితలంపై అతిపెద్ద భాగం విచ్ఛిన్నమైపోయి, సూర్యుడి ఉత్తరధృవం వైపు టోర్నడో తరహాలో సుడిగాలిని సృష్టించింది. ఈ సుడిగాలి సెకనుకు 96 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న అంశం ఏమిటంటే… సూర్యుడు అప్పుడప్పుడు భారీ అగ్నికీలలను విరజిమ్ముతుంటాడు. వీటి ప్రభావం భూమ్మీద ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలపై పడుతుంటుంది. అందుకే, తాజాగా సూర్యుడిపై చెలరేగిన సుడిగాలి ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందోనన్న ఆందోళన శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. దీనిపై లోతుగా విశ్లేషించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..