Little boy: జ్యూస్‌ని ఇలా కూడా తాగొచ్చా..బుడ్డోడు తెలివికి మామ షాక్..! ట్రెండ్ అవుతున్న వీడియో..
ఓ వ్యక్తి తన చిన్నారి మేనల్లుడు జాక్‌కి గ్లాస్‌లో జ్యూస్ ఎలా పోయాలో చూపిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారిని అతని మామయ్య నువ్వు ఏ చేత్తో జ్యూస్ గ్లాసులో పోస్తావు అని అడిగాడు.
చిన్న పిల్లలు అమాయకత్వంతో మాట్లాడే మాటలు అలరిస్తాయి.. కల్లాకపటం తెలియని పసివాళ్లు చేసే పనులు అల్లరికూడా ఆనందాన్నిస్తుంది. సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ పసివాడు తన మేనమామతో కలిసి చేసిన చిలిపి పని నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో క్రిస్ అనే ఓ వ్యక్తి తన చిన్నారి మేనల్లుడు జాక్‌కి గ్లాస్‌లో జ్యూస్ ఎలా పోయాలో చూపిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారిని అతని మామయ్య నువ్వు ఏ చేత్తో జ్యూస్ గ్లాసులో పోస్తావు అని అడిగాడు. అందుకు ఆ చిన్నారి రైట్ హ్యాండ్ అనిచెప్పాడు. దాంతో ముందుగా క్రిస్ కొంచె జ్యూస్ గ్లాస్‌లో పోసి, ఆ తర్వాత చిన్నారిని వెయ్యమని చెప్పాడు. దాంతో ఆ చిన్నారి జ్యూస్ జార్ తీసుకొని గ్లాస్‌లో పోస్తుండగా జ్యూస్ మొత్తం టేబుల్‌పైన పడిపోయింది. అంతేకాదు అతను జ్యూస్ వేస్తున్న గ్లాస్ కూడా పడిపోయింది. దాంతో ఎందుకలా చేశావ్.. జ్యూస్ మొత్తం వేస్ట్ అయింది అనగానే ఆ బుడ్డోడు మారు మాట్లాడకుండా టేబుల్‌పైకి వంగి నోటితో జ్యూస్ మొత్తం లాగించేసాడు. అది చూసి అతని మామయ్య ఆశ్చర్యపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 1.4 మిలియన్లమంది వీక్షించారు. కాగా ఈ మామ,అల్లుళ్లు సోషల్ మీడియాలో ఫేమస్ కూడా. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి చేసిన పనికి తెగనవ్వుకుంటున్నారు. సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు అలా చేయడం ప్రమాదం అంటూ సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

