Viral: ఈ చిన్న పురుగులు కిలో రూ.70 లక్షలు.. బంగారం కంటే విలువైన పురుగులు..
ఓ చిన్న పురుగు బంగారాన్ని మించి ధర పలుకుతుందంటే నమ్ముతారా.. అదికూడా చనిపోయిన తర్వాత అది లక్షల విలువ చేస్తుంది. అంత స్పెషలేంటి అనుకుంటున్నారా.. అవును స్పెషలే మరి. చూడ్డానికి పసుపు కొమ్ముల్లా కనిపిస్తున్న ఇవి గొంగళి పురుగులు.
ఓ చిన్న పురుగు బంగారాన్ని మించి ధర పలుకుతుందంటే నమ్ముతారా.. అదికూడా చనిపోయిన తర్వాత అది లక్షల విలువ చేస్తుంది. అంత స్పెషలేంటి అనుకుంటున్నారా.. అవును స్పెషలే మరి. చూడ్డానికి పసుపు కొమ్ముల్లా కనిపిస్తున్న ఇవి గొంగళి పురుగులు. ఇవి బంగారం కంటే విలువైనవి. చాలా అరుదుగా దొరుకుతాయి. ఆ గొంగళి పురుగుల కిలో ఏకంగా 70 లక్షలు ఖరీదు చేస్తాయి. ఇదేంటి గొంగళి పురుగులు చూపించి.. గోల్డ్ కంటే విలువైనవి అని అంటున్నారని అనుకోవద్దు. వాటినే హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. మనుషుల్లో లైంగిక సమస్యలకు ఇది దివ్యఔషధం అట. ఈ హిమాలయన్ వయాగ్రాకు చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో భారీ గిరాకీ ఉందంటున్నారు. హిమాలయాలపై సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఈ గొంగళి పురుగులు ఓ అరుదైన ఫంగస్ వల్ల చనిపోయి.. ఆ తర్వాత ఎండిపోతాయి. అలా అయిన వాటిని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. మే, జూన్ నెలల్లో దేశ విదేశాల నుంచి చాలామంది ఈ పురుగుల కోసం హిమాలయ పర్వతాలున్న ప్రదేశాలకు వస్తారు. కొన్నిసార్లయితే.. ఈ పురుగుల దొరకాలంటే.. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా హిమాలయ పర్వతాలు ఎక్కాల్సి ఉంటుంది. ఈ పురుగులను అక్కడ నివసించే స్థానికులు, విదేశీయులు ఎక్కువగా సేకరిస్తారు. అక్కడ చాలామందికి ఇదే ఆదాయ వనరుకూడా. అయితే ఈ పురుగులు దొరికినప్పుడు.. వీటిని అమ్మేందుకు సరైన కొనుగోలుదారులను ముందే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పురుగులు ఎక్కువగా దొరకట్లేదు. అంతేకాకుండా వీటి జాతి కూడా క్రమేపీ అంతరించిపోతుండటంతో వీటి ధర కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ పురుగులను లైంగిక సామర్ధ్యాన్ని పెంచేందుకు మాత్రమే కాదు.. క్యాన్సర్, డయాబెటిస్ లాంటి రోగాలు తగ్గేందుకు కూడా వినియోగిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!