Cat in Airport: అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో పిల్లికి ఉద్యోగం.. ఏం చేస్తుందంటే..!

Cat in Airport: అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో పిల్లికి ఉద్యోగం.. ఏం చేస్తుందంటే..!

Anil kumar poka

|

Updated on: Jun 22, 2023 | 7:56 AM

ఎయిర్‌ పోర్టులో ఓ పిల్లి ఎంతో దర్జాగా తిరుగుతోంది. అది ఏదో పొరపాటును ఎయిర్‌పోర్ట్‌లోకి పొరపాటున ప్రవేశించింది కాదండి బాబు.. అది ఎయిర్‌పోర్ట్‌లో ఓ బాధ్యతాయుతమైన ఉద్యోగి. ఏంటి నమ్మడం లేదా.. కానీ ఇది నిజం. సదరు పిల్లి పేరు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్.

ఎయిర్‌ పోర్టులో ఓ పిల్లి ఎంతో దర్జాగా తిరుగుతోంది. అది ఏదో పొరపాటును ఎయిర్‌పోర్ట్‌లోకి పొరపాటున ప్రవేశించింది కాదండి బాబు.. అది ఎయిర్‌పోర్ట్‌లో ఓ బాధ్యతాయుతమైన ఉద్యోగి. ఏంటి నమ్మడం లేదా.. కానీ ఇది నిజం. సదరు పిల్లి పేరు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. ఆ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే చిన్నా పెద్దా ఆఫీసర్లు అంతా మోరిస్ ను ఎంతో మర్యాదగా చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న ప్రయాణికులు ఆ పిల్లి కచ్చితంగా ఎవరో పెద్ద ఉద్యోగస్తుడి పెంపుడు పిల్లి అయి ఉంటుందని అనుకున్నారు. కానీ, ఆ ఎయిర్ పోర్టులో మిగతా ఉద్యోగుల తరహాలోనే సదరు పిల్లి కూడా ఓ ఉద్యోగి అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఎదురైన వింత అనుభవం. ఇంతకీ విమానాశ్రయంలో ఆ పిల్లి చేసే పనేంటంటే.. మొదటిసారి విమాన ప్రయాణం చేయడం వల్లో లేక విమాన ప్రయాణమంటే భయంవల్లో కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారట. అలాంటి ప్రయాణికుల వల్ల విమానాశ్రయంలో, విమాన ప్రయాణంలో చాలాసార్లు గందరగోళం నెలకొంటుందని అధికారులు చెప్పారు. వారి ఆందోళనను తగ్గించడమే ఈ పిల్లి పని. దీనినే యానిమల్ అసిస్టెడ్ థెరపీ అంటారు. ఈ పిల్లితో కాసేపు గడిపితే ప్రయాణం గురించిన టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఆపై భయపడకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నెర్వస్ ను పోగొట్టేందుకు ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!