Apple mango: మీరెప్పుడైనా ఇలాంటి మ్యాంగో చూశారా.? గడికోటలో వినూత్నమైన మామిడి..

|

Jun 08, 2022 | 9:38 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో వినూత్నమైన మామిడి రకాన్ని పండిస్తున్నాడు ఓ రైతు. కేవలం జపాన్‌లో మాత్రమే పండే ఆపిల్‌ మ్యాంగో సాగును చేపట్టాడు. కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉండే ఈ మామిడి రకాన్ని


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో వినూత్నమైన మామిడి రకాన్ని పండిస్తున్నాడు ఓ రైతు. కేవలం జపాన్‌లో మాత్రమే పండే ఆపిల్‌ మ్యాంగో సాగును చేపట్టాడు. కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉండే ఈ మామిడి రకాన్ని ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. రెడ్‌ మ్యాంగోగా చెప్పే ఈ మామిడి పండ్లను ఎంతో ఇష్టంతో సాగు చేస్తున్నానంటునంటున్నాడు రైతు వెంకటేశ్వరరావు. తెలంగాణలోని నర్సాపురం నుంచి ఈ మొక్కలను తీసుకొచ్చి సాగు చేస్తున్నానని తెలిపాడు. బహిరంగ మార్కెట్‌లో ఈ ఆపిల్‌ మ్యాంగో ధర కిలో ఐదొందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుందని చెబుతున్నాడు రైతు వెంకటేశ్వరరావు.జపాన్‌ దేశానికి చెందిన ఈ మామిడి పండ్లు అచ్చం కశ్మీర్‌ ఆపిల్‌ను పోలి ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆపిల్‌ మ్యాంగో స్పెషాలీటిస్‌ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. షుగర్‌ కంటెంట్‌ తక్కువ, ఫైబర్‌ అధిక శాతం ఉంటుందని చెబుతున్నాడు రైతు వెంకటేశ్వరరావు. ఈ రెడ్ మ్యాంగ్‌ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అంటున్నాడు. అయితే, ఇది అన్ని రకాల మామిడి రకాల్లా కాకుండా ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 కేజీల వరకు దిగుబడి వస్తుందని, పైగా ధర ఎక్కువగా ఉండటంతో మంచి లాభసాటిగా ఉందని చెబుతున్నాడు. ఎలాంటి కెమికల్స్‌ వినియోగించకుండా రెడ్‌ మ్యాంగో సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు రైతు వెంకటేశ్వరరావు. గోపంచకం, ఆవు పేడను ఎరువుగా మార్చి, ఆపిల్‌ మ్యాంగోను పండిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా కొత్త రకం మామిడిని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు రైతు వెంకటేశ్వరరావు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on