Tree felling: అయ్యో నేలకూలిన భారీ చెట్టు.. గూడు చెదిరి పక్షుల హాహాకారాలు.. క్రూరమైన చర్యగా..

సోషల్‌ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని పంచితే కొన్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో

Tree felling: అయ్యో నేలకూలిన భారీ చెట్టు.. గూడు చెదిరి పక్షుల హాహాకారాలు.. క్రూరమైన చర్యగా..

|

Updated on: Sep 07, 2022 | 9:06 AM

సోషల్‌ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆనందాన్ని పంచితే కొన్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల హృదయాలు ద్రవించి.. కన్నీరు పెట్టుకుంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియో ఓ చెట్టు కూల్చివేతకు సంబంధించినది. రోడ్డు పక్కనున్న ఓ చెట్టును జేసీబీతో కూల్చివేశారు. ఆ చెట్టుపై వందలాది పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. పక్షులు తమ కంటిపాపలకు ఆహారం పెడుతూ మురిసిపోతున్నాయి. ఇంతలో ఊహించని విధంగా చెట్టు కూలిపోయింది. ఆ అమాయక పక్షులకు ఆక్షణంలో ఏం జరుగుతుందో తెలియలేదు.. ఈ ఘటనలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు ఆ చెట్టు కింద పడి నలిగిపోయాయి. దాంతో ఆ ప్రదేశమంతా పక్షుల కళేబరాలు, పసికూనలతో ఉన్న గూళ్లు చెల్లాచెదురైపోయాయి. ఈ దృశ్యాన్ని చూసినవారి కళ్లు బాధతో చెమర్చాయి. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కశ్వాన్ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘ప్రతి ఒక్కరికీ ఇల్లు కావాలి, మనమెంత క్రూరంగా తయారవుతున్నాం’ అంటూ క్యాప్షన్ జోడించారు. కాగా ఈ ఘటన మలప్పరం జిల్లా తిరునంగడిలోని వీకే పడిలో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో అటవీ అధికారులు స్పందించారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. చెట్టును కూల్చిన జేసీబీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

జాతీయ రహదారి విస్తరణలో భాగంగానే చెట్టును కూల్చివేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేరళ అటవీశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ దీనిని క్రరూరమైన ఘటనగా అభివర్ణించారు. అటవీశాఖ అనుమతి లేకుండానే చెట్టును కూల్చారని చెప్పారు. చెట్టుపై పక్షులు, గూళ్లు ఉన్నప్పుడు దానిని కూల్చకూడదన్న కఠిన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని నిలంబూర్ నార్త్ డివిజనల్ అధికారి తెలిపారు. కాగా, వైరల్ అయిన ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. రీట్వీట్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Follow us
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..