Lucky woman: అదృష్టం అంటే ఆమెదే.. రెప్పపాటులో బయటపడింది.. ఒళ్ళు గగ్గురు పొడిచే వీడియో..
రోడ్డుపై నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్ని పొరపాటు కూడా పెనుప్రమాదానికి దారితీస్తుంది.
రోడ్డుపై నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో చిన్ని పొరపాటు కూడా పెనుప్రమాదానికి దారితీస్తుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతుంటాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రమాదాలు కొన్నిసార్లు విధ్వంసం సృష్టిస్తాయి. మరికొన్ని సార్లు అనుభవ పాఠాన్ని నేర్పిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్ లో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ రెండింటి మధ్య ఒక మహిళ ఉంది.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించండి…
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఓ కారు అదుపుతప్పి ఆమె వైపు దూసుకొచ్చింది. వేగంగా వచ్చి అక్కడ పార్క్‌చేసి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారుకి, ఆటోకి మధ్యలోమహిళ ఉండిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఘటనలో ఆ మహిళకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెండు వాహనాలు బోల్తా పడిన తర్వాత మహిళ తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన వేలాదిమంది నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

