Dog Viral video: పశ్చిమగోదావరి జిల్లాలో వింత సంఘటన.. ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేసిన శునకం..

Dog Viral video: పశ్చిమగోదావరి జిల్లాలో వింత సంఘటన.. ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేసిన శునకం..

Anil kumar poka

|

Updated on: Jun 15, 2022 | 8:22 AM

సాధారణంగా భక్తులు తమ కోర్కెలు నెరవేర్చమని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఇక్కడ ఒక శునకం తనకు ఏం కష్టం వచ్చిందో ఏమో దేవుడ్ని వేడుకోడానికి ఆలయానికి వచ్చింది... ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..


సాధారణంగా భక్తులు తమ కోర్కెలు నెరవేర్చమని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఇక్కడ ఒక శునకం తనకు ఏం కష్టం వచ్చిందో ఏమో దేవుడ్ని వేడుకోడానికి ఆలయానికి వచ్చింది… ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమగోదావరి జిల్లాలో వింత సంఘటన జరిగింది. వీరవాసరం మండలంలోని నందమూరిగరువులో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిరోజూ భక్తులు స్వామివారిని వేడుకునేందుకు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు.. తమ మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో ఓ తెల్లని శునకం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు.. ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ భక్తులతో కలిసి అరగంటపాటు ప్రదక్షిణలు చేసింది. ప్రదక్షిణలు పూర్తికగానే ఆ శునకం ఎటు వెళ్లిందో కూడా ఎవరికీ కనిపించలేదు. అయితే ఆ కుక్క ప్రదక్షిణలు చేస్తుండగా గమనించిన భక్తులు వీడియో తీసారు. అది సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదంతా దేవుని మహిమే అంటున్నారు స్థానిక భక్తులు, నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 15, 2022 08:22 AM