Supreme court: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి.. అభయమిచ్చిన సుప్రీంకోర్టు..

Supreme court: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి.. అభయమిచ్చిన సుప్రీంకోర్టు..

Anil kumar poka

|

Updated on: Jul 25, 2022 | 9:10 PM

పెళ్లికాకుండానే గర్భవతి అయిన ఓ యువతికి సుప్రీం కోర్టు అభయమిచ్చింది. 25 ఏళ్ల యువతి అబార్షన్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. 25 ఏళ్ల ఈ యువతి

పెళ్లికాకుండానే గర్భవతి అయిన ఓ యువతికి సుప్రీం కోర్టు అభయమిచ్చింది. 25 ఏళ్ల యువతి అబార్షన్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. 25 ఏళ్ల ఈ యువతి కొంత కాలంగా ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉండగా అవాంఛిత గర్భం దాల్చింది. ఈ క్రమంలో ఆ యువతి అబార్షన్‌ చేయించుకోవాలనుకుంది. అందుకు ఢిల్లీ హైకోర్టును అనుమతి కోరింది. యువతి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆ యువతి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఊహించని విధంగా సుప్రీం కోర్టు ఆ యువతి గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. 24 వారాల గర్భాన్ని తొలగించే క్రమంలో ఆ యువతికి ఎలాంటి ప్రాణహాని ఉండదని ఎయిమ్స్‌ ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డ్‌ చెప్పడంతో సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే పెళ్లి కానందువల్ల యువతి అబార్షన్‌కు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు 2021లో సవరించిన మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రస్తావించింది. దీని ప్రకారం అలాంటి పరిమితులేమీ లేవని, పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తూ కీలక తీర్పునిచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 25, 2022 09:10 PM