Leopard-Cow: చిరుతకు చుక్కలు చూపించిన ఆవు.. చిరుత ఏంటి ఇలా చేసింది ఊహించని షాక్..!
అడవిలో వేటగాడు వేటాడతాడు. బలహీనులు బలవంతుల ముందు తలవంచాల్సిందే. పులులు ఎంత పెద్ద జంతువునైనా వేటాడి వెంటాడి చంపిం తినేస్తుంది. అడవిలో క్రూర మృగాల పోరాటం..
అడవిలో వేటగాడు వేటాడతాడు. బలహీనులు బలవంతుల ముందు తలవంచాల్సిందే. పులులు ఎంత పెద్ద జంతువునైనా వేటాడి వెంటాడి చంపిం తినేస్తుంది. అడవిలో క్రూర మృగాల పోరాటం.. వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తుంటాయి. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో వైరల్ అవుతోంది. అక్కడ వేటను చూసిన తర్వాత కూడా చిరుత పులి ఎవరూ ఊహించని పనిని చేశాడు. అటువంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడ ఓ చిరుతపులి తన ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించింది. రోడ్డుపై అడవి నుంచి వచ్చిన చిరుతపులి పక్కనే ఆవు గడ్డి మేస్తోంది. ఆవుపై చిరుతపులి కన్ను పడగానే, వేగంగా దాడి చేసి దానిని తన వేటగా మార్చుకుంటుందనుకుంటాం. చిరుతపులి తన స్వభావంతో చాలా ప్రశాంతంగా కనిపించింది. కానీ చిరుతపులి ముందుకి వచ్చిన క్షణంలో ఆవు దాన్ని చూసి భయపడిపోయింది. అయితే చిరుత ఆవును వేటాడకుండా దాన్ని దాటి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. వీడియోలో చిరుతపులి వ్యవహరించిన తీరు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అదే దారిలో వెళుతున్న కొందరు తమ కెమెరాల్లో చిరుతను బంధించారు. ఈ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos