Viral Video: పేదవాడిని భయపెట్టేది ఇదొక్కటే..! ఆకలి పోరాటానికి సజీవ సాక్ష్యం..
ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. కానీ, కొన్ని వీడియోలు చూడగానే షాక్ అయ్యేలా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూస్తే.. ఆకలి ఎంత భయంకరమైనదో తెలుస్తుంది.ఈ వీడియోలో ఓ యువకుడు భవనం నిర్మాణ పనులు చేస్తున్నాడు. అందులో భాగంగా భూమిపై నుంచి కొన్ని అడుగుల ఎత్తులో అతడు స్లాబ్ వేసేందుకు గాను చెక్కలను పేరుస్తున్నాడు. అంత ఎత్తులో కూడా అతడు ఎలాంటి సేఫ్టీ లేకుండా ఆ పని చేయడం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోతాయని తెలిసి కూడా పొట్టకూటి కోసం అతడు ఇంత రిస్క్ చేయడం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ‘హస్నా జరూరి హై’ (HasnaZarooriHai) అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఓ పేదవాడు చావు కంటే కూడా ఆకలికే ఎక్కువ భయపడతాడు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకు వీడియోను 40వేలకు పైగా మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికుల సేఫ్టీకి కాంట్రాక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!