పాచిపోయిన అన్నం పెడుతున్న వార్డెన్‌పై17 కి.మీ. నడిచి వెళ్లి అమ్మాయిల కంప్లైంట్!!
జార్ఖండ్‌లో 60మంది హాస్టల్ బాలికలు సాహసం చేశారు. వార్డెన్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రాత్రంతా 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.
జార్ఖండ్‌లో 60మంది హాస్టల్ బాలికలు సాహసం చేశారు. వార్డెన్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రాత్రంతా 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. వార్డెన్‌పై డిప్యూటీ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సింగ్‌భూమ్ జిల్లాలోని ఖుంట్‌పాని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగింది. హాస్టల్ లో కొంతకాలంగా పాచిపోయిన ఆహారం పెడుతున్నారని, నేలపైనే పడుకోవాలని బెదిరిస్తున్నారని అమ్మాయిలు ఆరోపించారు. టాయిలెట్లను కూడా తమతోనే క్లీన్ చేయిస్తున్నారు. ఇదేంటని అడిగితే కొడుతున్నారని వార్డెన్ పై కంప్లైంట్ చేశారు. హాస్టల్ తనిఖీ కోసం వచ్చే అధికారులతో అంతా బాగానే ఉన్నట్లు అబద్ధాలు చెప్పమని బలవంతం చేస్తున్నారని చెప్పారు. దీంతో విసుగెత్తిపోయిన స్టూడెంట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయి.. ఎమోషనల్ పోస్ట్ !!
ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్ విత్‌డ్రా చేసుకోండి !!
Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!
డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు