Petunia Glows: చీకట్లో మెరిసే మొక్కలు.. అమ్మకానికొచ్చాయ్‌.! ఎంతంటే.?

|

Feb 17, 2024 | 7:45 PM

రాత్రి కాగానే అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. మొక్కలు, చెట్లు, జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి. కానీ అక్కడక్కడా మిణుగురు పురుగులు వెలుగులు జల్లుతూ తిరుగుతుంటాయి. కొన్ని రకాల పుట్టగొడుగులు , బయో ల్యూమినిసెంట్‌ మష్రూమ్స్‌ చిన్నగా కాంతిని వెదజల్లుతుంటాయి. ఇది చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి.. చీకట్లో కాంతిని వెదజల్లే మొక్కలను సృష్టించారు.

రాత్రి కాగానే అడవిని చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. మొక్కలు, చెట్లు, జంతువులన్నీ చీకట్లో ఉండిపోతాయి. కానీ అక్కడక్కడా మిణుగురు పురుగులు వెలుగులు జల్లుతూ తిరుగుతుంటాయి. కొన్ని రకాల పుట్టగొడుగులు , బయో ల్యూమినిసెంట్‌ మష్రూమ్స్‌ చిన్నగా కాంతిని వెదజల్లుతుంటాయి. ఇది చూసిన శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించి.. చీకట్లో కాంతిని వెదజల్లే మొక్కలను సృష్టించారు. పుట్టగొడుగుల్లో కాంతిని వెదజల్లే సామర్థ్యానికి కారణమైన జన్యువులను సేకరించి.. ‘పెటునియా’పూల మొక్కల్లో ప్రవేశపెట్టారు. వీటికి ‘ఫైర్‌ఫ్లై పెటునియా’అని పేరుపెట్టారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కల పూలు.. రాత్రిపూట ఆకుపచ్చని కాంతులు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడీ పూల మొక్కలను అమ్మకానికి కూడా పెట్టారు. ఒక్కో మొక్క ధర సుమారు రూ.2,500 మాత్రమే. ఈ ‘ఫైర్‌ఫ్లై పెటునియా’మొక్కలను అభివృద్ధి చేసింది అమెరికాలోని ఇడహో రాష్ట్రానికి చెందిన లైట్‌ బయో సంస్థ. 50 వేల మొక్కలను అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రస్తుతానికి ఇవి అమెరికాలో మాత్రమే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఇవి జన్యుమార్పిడి మొక్కలు కావడంతో.. అనుమతులను బట్టి ఇతర దేశాల్లోనూ అమ్మేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..