Caste exclusion: ఇంకా రాచరికమా..? ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నందుకు కుటుంబం వెలివేత..! వీడియో..
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కులాలు వేరైనా.. ఇరువురి తల్లితండ్రులను ఒప్పించారు. వారి సమక్షంలోనే పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కులాంతర వివాహం చేసుకున్న యువతి కుటుంబాన్ని
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కులాలు వేరైనా.. ఇరువురి తల్లితండ్రులను ఒప్పించారు. వారి సమక్షంలోనే పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కులాంతర వివాహం చేసుకున్న యువతి కుటుంబాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు కుల సంఘం పెద్దలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకు ఇరువురి తల్లి తండ్రులు కు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ.. ఆ గ్రామంలో అమ్మాయి తరుపు కులానికి చెందిన కుల సంఘం పెద్దలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు 20 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. అంతేకాదు.. ఆ కుటుంబంతో ఎవ్వరైనా మాట్లాడిన, శుభ కార్యాలకు పిలిచినా.. జరిమానా విధిస్తామని కుల సంఘం పెద్దలు తీర్మానించారు. మరోవైపు కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్న చందంగా.. కుల పెద్దల బహిష్కరణ తీరు ఉందని స్థానికులు నవ్వుకుంటున్నారు. తమ కుల సంఘం పెద్దలు నా కుటుంబాన్ని బహిష్కరించారని పెనుబల్లి పోలీసులకు పిర్యాదు చేశారు బాధితులు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

