AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: ఓ ఇంటివాడైన  రెండున్నర అడుగుల వ్యక్తి.. 3 అడుగుల యువతి బుహ్రాతో వైభవంగా పెళ్లి..

Wedding: ఓ ఇంటివాడైన రెండున్నర అడుగుల వ్యక్తి.. 3 అడుగుల యువతి బుహ్రాతో వైభవంగా పెళ్లి..

Anil kumar poka
|

Updated on: Nov 07, 2022 | 9:58 AM

Share

ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తి ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. తనకంటే అర అడుగు ఎత్తయిన యువతిని వివాహం చేసుకుని తన జీవిత కల సాకారం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ షామ్లీలోని కైరానాకు చెందిన 32 ఏళ్ల అజీమ్‌ మన్సూరి ఎత్తు కేవలం రెండున్నర అడుగులు.


ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తి ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. తనకంటే అర అడుగు ఎత్తయిన యువతిని వివాహం చేసుకుని తన జీవిత కల సాకారం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ షామ్లీలోని కైరానాకు చెందిన 32 ఏళ్ల అజీమ్‌ మన్సూరి ఎత్తు కేవలం రెండున్నర అడుగులు. ఈ క్రమంలో అతనికి వివాహం జరగడం కష్టంగా మారింది. పెళ్లి చేసుకుని తానూ ఓ ఇంటివాడినవ్వాలని కలలు కనే అజీమ్‌ తనకు జోడైన అమ్మాయిని చూసి పెట్టమని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను సైతం కలిసి విన్నవించుకున్నాడు. తనకు ఈడు, జోడైన వధువు కోసం ఏళ్లతరబడి ప్రయత్నించాడు. ఎట్టకేలకు తన ప్రయత్నం ఫలించింది. గత ఏడాది మార్చిలో తనకు జోడైన మూడు అడుగుల ఎత్తైన బుష్రాను కలిశాడు. హాపూర్‌కు చెందిన ఆమెతో గత ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. అయితే బుష్రా డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. అంతేకాదు తమ వివాహానికి వచ్చి తమను ఆశీర్వదించాల్సిందిగా ప్రధాని మోదీకి సైతం ఇన్విటేషన్‌ పంపిస్తానని చెప్పాడు అజీమ్‌.ఈ క్రమంలో ఇటీవలే బుష్రా డిగ్రీ పూర్తి చేసింది. దాంతో అజీమ్‌ మన్సూరి కలగన్న రోజు రానే వచ్చింది. మన్సూరి ఇంట పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. తనను అభిమానించే వారినందరినీ పెళ్లికి ఆహ్వానించాడు. దీంతో అందంగా ముస్తాబైన మన్సూరి ఇంటి వద్దకు వారంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బుష్రాతో అతడి పెళ్లి నవంబరు 2 న వైభవంగా జరిగింది. ‘దేవుని దయతో, ఈ క్షణం నా జీవితంలోకి వచ్చింది. ఇది సంతోషకరమైన సందర్భం. నా ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ నా పెళ్లికి ఆహ్వానించాను’ అని మన్సూరి తెలిపాడు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. అత్యంత పొట్టి వాడైన వరుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో జనం తాకిడితో ఇబ్బంది పడిన పొరుగువారు, స్థానికులను నియంత్రించేందుకు పోలీసుల సహాయం కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 07, 2022 09:56 AM