Groom: మరికొద్ది గంటల్లో పెళ్లి.. సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వరుడు.. కట్ చేస్తే.!
వారిద్దరూ ఒకరికొకరు నచ్చారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించారు. వివాహ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఇక మరికొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు తన సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. సీన్ కట్ చేస్తే..
హర్యానాలోని రేవరి జిల్లాకు చెందిన రాహుల్ అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రిందట ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ముహూర్తం డేట్ రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా.. వరుడు తన సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. సోదరిని అక్కడ దింపేసి.. తాను స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పాడు. సమయం గడిచింది.. కాని అతడు మాత్రం తిరిగి రాలేదు. దీంతో ఆమె ఇంటికి చేరుకొని కుటుంబసభ్యులకు అసలు విషయాన్ని తెలియజేసింది. వారంతా కూడా స్థానికంగా ఉన్న అన్ని చోట్లా అతడి కోసం గాలించారు. ఎక్కడా ప్రయోజనం లేకపోవడంతో.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాహుల్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో.. రాహుల్ స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇలా పెళ్లికి ముందు వరుడు కనిపించకుండా పోవడంతో అతిధులంతా అయోమయంలో పడ్డారు. అయితే వరుడు పెళ్లికి అంగీకరించి, ముహూర్త సమయానికి ఇలా మిస్సవడం మిస్టరీగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

